మిలెట్ శక్తి కేఫ్ ప్రారంభం
జయపురం: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మిలెట్ శక్తి కేఫ్‌ను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి శుక్రవారం ప్రారంభించారు. రూ. 12 లక్షల 50 వేల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్నంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేఫ్‌లో పుష్టికర, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. మండియ ఆహార పదార్థాలను ప్రజలకు పరిచయం చేయటమే కేఫ్ ప్రధాన లక్ష్యం అన్నారు. కేఫ్‌లో మండియ (రాగులు)లతో తయారు చేసే మండియ కేక్, పొడపిట్ట, లస్సీ, మండియ టీ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు మిలెట్ శక్తి కేష్‌లలో కొనుగోలు చేసి చేయూత ఇవ్వాలన్నారు. కేఫ్ ప్రారంభోత్వవ కార్యక్రమంలో గౌరవ అతిథిగా మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, సీడీపీవో కాంచన పండ, మున్సిపల్ సహాయ కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, మున్సిపల్ ఇంజినీర్ అజయ జాని, చైతన్య బాసెకె పాల్గొన్నారు.
మిలెట్ శక్తి కేఫ్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment