ఆక్రమణల తొలగింపునకు చర్యలు
జయపురం: స్థానిక జగన్నాథ్‌సాగర్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులలో భాగంగా సాగర్ స్థలాల ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ్ సాగర్‌కు ఒక పక్కనున్న మత్స్య విభాగ కార్యాలయం ప్రహరీ పడగొట్టేందుకు మున్సిపల్ అధికారులు ఆదేశించారు. జగన్నాథ్ సాగర్ స్థలంలో మత్స్య విభాగ ఆధీనంలోని 45 హెక్టార్ల స్థలం ఉండేది. అందులో ఇప్పటికే 25 హెక్టార్ల స్థలం పట్టణాభివృద్ది విభాగానికి అప్పజెప్పింది. మిగతా 20 హెక్టార్లను అతిత్వరలో అప్పజెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మత్స్య విభాగ అధికారులు లక్షలాది రూపాయల ఖర్చుతో తమ కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. పట్టణాభివృద్ధికి అప్పగించాల్సిన స్థలం చుట్టూ ప్రహరీ ఎందుకు కడుతున్నారని జగన్నాథ్ సాగర్ ట్రస్టు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి కుమారి ఎ.శొశ్య రెడ్డి ఆదేశం మేరకు మల్స్‌పల్ కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, జూనియర్ ఇంజినీర్ ప్రతాప్ చంద్ర ఆచార్య, జగన్నాథ్ సాగర్ ట్రస్టు సభ్యులు ఆ ప్రాంతాన్ని సందరిశంచారు. ఆక్రమణల తొలగింపు, పైన, పట్టణంలో మురికి కాల్వల నుంచి సాగర్‌లోనికి వస్తున్న నీటిని నిరోధించేందుకు ట్రస్టు సభ్యులు మున్సిపల్ అధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment