నరసరావుపేటటౌన్: సాయి సాధన చిట్‌ఫండ్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు పాలడుగు పుల్లారావు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. చీటీపాటలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో సాయి సాధన చిట్‌ఫండ్ నిర్వాహకుడు పుల్లారావుతో పాటు సంస్థలో డైరెక్టర్‌లుగా ఉన్న పాలడుగు వాణిశ్రీ, పాలడుగు పవన్‌కుమార్, పాలడుగు హర్షవర్థినిలు రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుమారు 800 మంది బాధితుల నుంచి రూ.300 కోట్లకు పైగా సేకరించినట్లు విచారణలో తేల్చారు. కేసును సీఐడీకు అప్పగించారు. ఇప్పటికే పుల్లారావు కోర్టులో లొంగిపోయి సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా, కేసులో నిందితులుగా ఉన్న అతని కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం 13వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ ద్వారా వేసిన సిట్ బృందం డీఎస్పీ కేసు సీడీ ఫైల్‌ను గురువారం జిల్లా కోర్టుకు అందజేశారు. దీనిపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment