కనుల పండువగా జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం
సత్తెనపల్లి: పట్టణంలోని వడ్డవల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, పంచగవ్యారాధన, ప్రాత:సవనం, ఉక్త, మూర్తి హోమాలు, రత్నన్యాసం, బీజన్యాసం, యంత్ర స్థాపన చేపట్టారు. జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళావాహన, ధేను దర్శనం, కుంభదృష్టి, ప్రథమ పూజ, పూర్ణాహుతి, నీరాజనమంత్రపుష్పములు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జై శ్రీ రామ్ ... జై హనుమాన్ నామస్మరణ మార్మోగింది. దేవదాయ శాఖ కార్యనిర్వాహ ణాధికారి సనిమెళ్ళ కోటిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment