ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్ర
దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యం వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు.
సాంకేతికతతో కొత్త అవకాశాలు
చేబ్రోలు: సాంకేతికతతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విత్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై రెండు రోజుల పాటు బ్లెండెడ్ మోడ్‌లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కవథేకర్ మాట్లాడుతూ ఆటోమేషన్, ఏఐ, డేటా ఎనలిటిక్స్ తదితర అంశాల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment