సాధారణ స్థాయి నుంచి జిల్లా అధికారిగా..
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నీలావతిదేవి నేడు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బీఎడ్ పూర్తిచేశారు. భర్త ప్రోత్సాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యామండలిలో 20 సంవత్సరాలపాటు పనిచేశారు. అనంతరం ఏలూరు, రాజమండ్రిలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేసి నూతన జిల్లాల ఆవిర్భావంతో పల్నాడు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కత్తి మీద సాముగా గుర్తించి సమర్థంగా నడుపుతున్నారు. జిల్లాలోని ప్రతి ఇంటర్మీడియెట్ కళాశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
కుటుంబ ప్రోత్సహంతోనే...
మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేస్తున్నా. నా జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు వారు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అంతరిక్షానికై నా ఎగురగలరు. సైన్యంలో చేరి సరిహద్దులను కాపాడగలరు.
–నీలావతిదేవి, ఇంటర్ విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment