చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది ఆమె. తన మాతృమూర్తి తనను, తమ్ముడిని పెంచేందుకు పడిన కష్టాన్ని గమనిస్తూ ఎదిగింది. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తల్లి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, తాను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యానికి మెట్టినిల్లు అండగా నిలిచింది. భర్త, అత్తమామలు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికై రెవెన్యూ డివిజనల్ అధికారిగా నరసరావుపేట ఆర్డీవోగా మధులత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా చిక్కుముడిగా ఉన్న లింగంగుంట్ల ఈనాం భూ సమస్యను పరిష్కరించటంలో తనదైన పాలనను చూపారు.
Comments
Please login to add a commentAdd a comment