నేడు పీజీఆర్‌ఎస్
నరసరావుపేట: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల రోజుల పాటు నిలిపివేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని వారు కోరారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.90 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 8,023 క్యూసెక్కులు విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment