ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Published Thu, Jan 30 2025 12:49 AM | Last Updated on Thu, Jan 30 2025 12:49 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

వచ్చేనెల 3న నోటిఫికేషన్‌

10 వరకు నామినేషన్ల స్వీకరణ

27న పోలింగ్‌ –మార్చి 3న కౌంటింగ్‌

● అమల్లోకి ఎన్నికల నియమావళి: కలెక్టర్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనట్టు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం వచ్చేనెలతో ముగియ నుండడంతో ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. అదే నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి 3న ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మార్చి 8వ తేదీన ముగుస్తుందని వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని తెలిపారు.నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని, www. nvsp.in వెబ్‌సైటులో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, 1952 ఓటరు హెల్ప్‌లైన్‌ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డా.మీనాక్షి

సాలూరు: సాలూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ వీఆర్‌ మీనాక్షి బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్‌ సివిల్‌ డాక్టర్‌గా తనకు సూపరింటెండెంట్‌ బాధ్యతలు అప్పగించాలని ఆమె కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు జారీ అయిన కోర్టు ఉత్తర్వులతో సూపరింటెండెంట్‌గా ఆమెను నియమిస్తూ ఉమ్మడి జిల్లా వైద్యసేవల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

గజరాజుల బీభత్సం

పంటలు ధ్వంసం చేస్తున్న గజరాజుల గుంపు

కొమరాడ: కురుపాం నియోకవర్గంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల నాగవళి నదీ పరివాహక ప్రాంతాలైన కళ్లికోట, దుగ్గి, గుణానపురం తదితర గ్రామల్లో సంచరిస్తూ అరటి, బొప్పాయి తోటలను ధ్వంసం చేశాయి. మంగళవారం రాత్రి కొమరాడ మండలం పాలేం గ్రామ సమీపంలో సీహెచ్‌ సత్యానారాయణ అనే రైతుకు చెందిన పామాయిల్‌, కర్భూజా తదితర పంటలను నాశనం చేశాయి. పది ఎకరాల్లోని పంటను నాశనం చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.

సైబర్‌ నేరాల కట్టడే లక్ష్యం

ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి

పార్వతీపురంటౌన్‌: సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో పోలీస్‌ అధికారులతో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే నిరుపేదలు, మహిళలు, వృద్ధుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణలో బేసిక్‌ పోలీసింగ్‌ను మరిచిపోవద్దని, గ్రామ సందర్శనలు, పెట్రోలింగ్‌, రాత్రి, పగలు బీట్లు చేయాలని, గ్రామాల్లో చెడునడత కలిగిన వ్యక్తులు, గ్రామాల్లోని ప్రధానమైన శాంతిభద్రతల సమస్యలపై విచారణ జరపాలన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగించే వారిపై జిల్లా పోలీసులు చేపడుతున్న చర్యలను తెలిపారు. నేర సమీక్ష సమావేశంలో సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 1
1/2

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 2
2/2

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement