పోలమాంబ తొలిజాతర ఆదాయం రూ.25,02,816 | - | Sakshi
Sakshi News home page

పోలమాంబ తొలిజాతర ఆదాయం రూ.25,02,816

Published Thu, Jan 30 2025 12:50 AM | Last Updated on Thu, Jan 30 2025 12:49 AM

పోలమా

పోలమాంబ తొలిజాతర ఆదాయం రూ.25,02,816

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి తొలిజాతర ఆదాయం రూ. 25,02,816 వచ్చినట్టు ఈవో వి.వి.సూర్యనారాయణ బుధవారం తెలిపారు. హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు మినహా, శీఘ్రదర్శనం టికెట్ల విక్రయంతో రూ.4,41,700, ప్రత్యేకదర్శనం టికెట్ల ద్వారా రూ.1,21,380, కేశఖండన టికెట్ల విక్రయంతో రూ.20,200, మహా అన్నదానానికి విరాళాల రూపంలో రూ.78,911, లడ్డూ ప్రసాదం విక్రయంతో 97,995, పులిహోరా ప్రసాదం ద్వారా రూ.76,030, కొబ్బరి చిప్పల వేలం వేయడం వల్ల రూ.5,51,000, చీరలు, రవికలు, ఇత్తడి సామగ్రి వేలంపాటు ద్వారా రూ.4,05,000, తలనీలాలు వేలంపాటతో రూ.3,37,600, దీపారాధనతో రూ. 2,21,000, లామినేషన్‌ ఫొటోలు వేలంపాట ద్వారా రూ. 1,52,000లు వచ్చినట్టు ఈఓ తెలిపారు. గతేడాది కంటే రూ.3,91,005ల అధిక ఆదాయం సమకూరిందన్నారు.

విద్యార్థుల భవితతో

ఆడుకోవద్దు

మా ఊరిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో మా పాఠశాలను ప్రైమరీ స్కూల్‌గా స్థాయి తగ్గిస్తామంటున్నారు. ఇలా అయితే 6,7,8 తరగతుల విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళతారే తప్ప ప్రభుత్వ హైస్కూల్‌ వెళ్లే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలను అడ్డుకుంటాం.

– వావిలపల్లి హరిబాబు, దశుమంతపురం, వీరఘట్టం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
పోలమాంబ తొలిజాతర ఆదాయం రూ.25,02,8161
1/1

పోలమాంబ తొలిజాతర ఆదాయం రూ.25,02,816

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement