పనులన్నీ ఏకపక్షం!
పంచాయతీ తీర్మానాలకు మంగళం..
● సాలూరు నియోజకవర్గంలో
వింత పోకడ
● అంతా కూటమి నాయకుల
కనుసన్నల్లో జరగాల్సిందే..
● గ్రామాల్లో తమ్ముళ్ల మాటే వేదం
● సర్పంచ్ మాటకు విలువివ్వని వైనం
● సంతకం ఆలస్యమైందని సాలూరు ఎంపీడీవోకు బదిలీ ‘ట్రీట్మెంట్’
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలు వైఎస్సార్సీపీవే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పల్లె పండగ, గోకులాలు, గుంతలు లేని రోడ్లు అంటూ కొన్ని కార్యక్రమాలను గ్రామాల్లో చేపడుతోంది. వాస్తవానికి ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా.. పంచాయతీ, మండల తీర్మానం ఉండాలి. ఈ నియోజకవర్గంలో అసలు సర్పంచ్ తీర్మానంతో సంబంధం లేదన్నట్లే ‘ప్రత్యేక రూల్స్’ అమలవుతున్నాయి. పనులన్నీ ఏకపక్షంగా ఆమోదించేసుకుంటున్నారు. ‘తమ్ముళ్ల’కే ‘ఉపాధి’ కల్పించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. పోనీ.. ‘తమ్ముళ్లయినా’ ఈ పనులు చేసుకుంటున్నారా.. అంటే అదీ లేదు! వారు కాస్త వాటిని కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment