‘అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం ’ | - | Sakshi
Sakshi News home page

‘అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం ’

Published Fri, Jan 31 2025 1:20 AM | Last Updated on Fri, Jan 31 2025 1:20 AM

‘అమలు

‘అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం ’

గోదావరిఖని: కాంగ్రెస్‌ పార్టీ అనేక అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ విమర్శించారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని గాంధీజీ విగ్రహానికి గురువారం ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలు గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్‌ తీరు మారాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మూల విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్‌, గాధం విజయ, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, శివకుమార్‌, నాయకులు మారుతి, బోడ్డు రవీందర్‌, బోడ్డుపల్లి శ్రీనివాస్‌, రాకం వేణు, అచ్చే వేణు, తోట వేణు, సట్టు శ్రీనివాస్‌, తోకల రమేశ్‌ పాల్గొన్నారు.

బండలవాగు చెరువు ట్రయల్‌ రన్‌

పాలకుర్తి(రామగుండం): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిని కుక్కలగూడూరు బండలవాగు చెరువులో నింపేందుకు చేపట్టిన ఎత్తిపోతల పనులు పూర్తికావడంతో గురువారం ఇరిగేషన్‌ అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. బండలవాగు చెరువు ద్వారా పుట్నూర్‌, జయ్యారం, కుక్కలగూడూరు, వేంనూర్‌ పరిధిలో దాదాపు 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తొలుత దివంగత సీఎం వైఎస్సార్‌, అప్పటి శాప్‌ చైర్మన్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చొరవతో చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రతిపాదన మరుగున పడగా.. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. త్వరలోనే అధికారికంగా ఎత్తిపోతలను ప్రారంభించి చెరువును నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం ’1
1/1

‘అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement