మంథని: ఎక్లాస్పూర్ సమీపంలోని గాడుదలగండిగుట్ట వద్ద గంజాయి కలిగిఉన్న ఇద్దరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కవర్‌తో గంజాయితోపాటు రూ.4వేలు స్వాధీనం చేసుకున్నారు. మంథని శ్రీపాదకాలనీకి చెందిన తైదాల సురేశ్, తుత్తుర్ల మహేశ్ కొద్దిరోజులుగా పరిచయస్తులైన కోరవేనా రవిసాగర్, ఆసంపల్లి తరుణ్, గుండా యశ్వంత్, టాంక్ గోవింద్‌సింగ్, అంకూస్ గంజాయి తాగుతున్నారు. రూ.వెయ్యి చొప్పున రూ.7వేలు జమచేసుకొని సురేశ్, మహేశ్ హైదరాబాద్ వెళ్లి ధూల్‌పేటలోని లడ్డు వద్ద 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత గుర్తు తెలియని వారికి విక్రయించగా.. రూ.4 వేలు వచ్చాయి. మిగిలింది తాగే క్రమమంలో మిగతా స్నేహితుల కోసం ఎదురుచూస్తున్నారు. అటుగా వస్తున్న పోలీసులను చూసి భయపడి పారిపోయారు. పోలీసులు వెంటపడి వారిని పట్టుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పాముకాటుతో స్వీపర్ మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కిష్టంపేట గ్రామానికి చెందిన పార్ట్‌టైం స్వీపర్ బండి మధునయ్య(55) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం చెత్త తొలగిస్తుండగా పాముకాటుకు గురైన మధునయ్యను కరీనంగర్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మధునయ్య కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం కలిపించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని ఎంఈవో మహేశ్, ఎస్సై వెంకటేశ్ నచ్చజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment