రామగుండంలో ‘దక్షిణ్‌’ ఆగదు | - | Sakshi
Sakshi News home page

రామగుండంలో ‘దక్షిణ్‌’ ఆగదు

Published Fri, Jan 31 2025 1:20 AM | Last Updated on Fri, Jan 31 2025 1:20 AM

రామగుండంలో ‘దక్షిణ్‌’ ఆగదు

రామగుండంలో ‘దక్షిణ్‌’ ఆగదు

● హాల్టింగ్‌ ఎత్తివేసిన రైల్వే అధికారులు ● అయోమయంలో ప్రయాణికులు

రామగుండం: వివిధ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పలు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలనే డిమాండ్‌, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, ఉన్న రైళ్ల హాల్టింగ్‌ ఎత్తివేయడంతో ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతీరోజు రాత్రి హైదరాబాద్‌ – హజ్రత్‌ నిజాముద్దీన్‌ (రైలు నంబరు 12721) మధ్య నడిచే దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు హజ్రత్‌ నిజాముద్దీన్‌ వెళ్లే క్రమంలో రామగుండంలో హాల్టింగ్‌ ఎత్తివేశారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో రామగుండంలో హాల్టింగ్‌ కొనసాగిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. తమ పనులు ముగించుకొని సికింద్రాబాద్‌లో రాత్రి పదకొండు గంటలకు బయలు దేరడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతవాసులకు సౌకర్యంగా ఉండేది. రైల్వే అధికారులపై ప్రయాణికులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఆర్నెల్లక్రితం రైలుకు రామగుండంలో హాల్టింగ్‌ కల్పించిన అధికారులు.. మూడు రోజుల క్రితం ముందస్తు సమాచారం లేకుండా హాల్టింగ్‌ ఎత్తివేయడంతో ప్రయాణికులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ వైపు హైద్రాబాద్‌/సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య మరిన్ని నూతన రైళ్లను ప్రవేశపెట్టాలని, మరికొన్నింటికి హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఏకపక్షంగా హాల్టింగ్‌ ఎత్తివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి రైల్వే జీఎంతో సంప్రదింపులు జరిపి హాల్టింగ్‌ పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement