నిందితులపై చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని గురువారం రాత్రి ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు డిమాండ్ చేశారు. నా యకులు కొలిపాక కృష్ణ, సంతోష్ తదితరులతో పాటు మహిళల ఆధ్వర్యంలో స్థానిక కమాన్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం బైఠాయించారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో సమా చారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై రామస్వామి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం నాయకుడు కొలిపాక కృష్ణ తదితరులు మాట్లాడారు. పెద్దమ్మనగర్ ప్రాంతంలోని ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి ఆలయాన్ని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ కొలిపాక నర్సయ్య రూ.40 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారని గుర్తుచేశారు. ఆలయం ఎదు ట పేర్లు రాయించుకోవడాన్ని జీర్ణించుకోలేని బూతగడ్డ రాజ్‌కుమా ర్, బూతగడ్డ నరేశ్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయమై పోలీ సులకు ఫిర్యాదు చేసి నా పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధితోపాటు మాజీ కౌన్సిలర్ బూ తగడ్డ సంపత్ అండదండలు నిందితులకు ఉన్నా యని ఆరోపించారు. పోలీసులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
ముదిరాజ్ సంఘం నాయకుల డిమాండ్
రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment