75 ఏళ్ల వృద్ధురాలికి తుంటి శస్త్రచికిత్స
కరీంనగర్టౌన్: స్థానిక ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అనారోగ్య సమస్యలున్న 75 ఏళ్ల వృద్ధురాలికి తుంటి ఎముక శస్త్రచికిత్స ను విజయవంతంగా పూర్తిచేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఎస్.లచ్చమ్మ కిందపడగా కాలు తుంటి ఎముక విరిగింది. ఆమెను ఈనెల 25న ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు నిర్వహించి వయస్సును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఆమెకు గుండె వ్యాధి, అస్థమా, రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. పేషెంట్ పరిస్థితిని అంచనా వేస్తూ గురువారం శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత లచ్చమ్మ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్సలో డాక్టర్లు ఆదిత్య, సంగీత, మహేశ్, ఉబేదుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment