● రైతులు ఆందోళన చెందొద్దు ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి/ఎలిగేడు/జూలపల్లి/సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్: ప్రతీఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎస్సారెస్పీ డీ– 83, 86 కాకతీయ కాలువలకు సాగునీటిని సరఫరా చేసే రెవెల్లె ప్రధాన డిస్ట్రిబ్యూటరీని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎ స్సారెస్పీ అధికారులతో మాట్లాడి సాగునీటి విడుదల ప్రణాళిక, నీటిలభ్యత, ప్రవాహంలో ఇబ్బందులపై ఆరా తీశారు. కాల్వశ్రీరాంపూర్‌లో నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించారు. నాయకులు సారయ్యగౌడ్, రామిడి తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, రామ చంద్రారెడ్డి, ప్రకాశ్‌రావు, శిరీష, లంక సదయ్య, మూల రమణారెడ్డి, కటుకూరి రాజిరెడ్డి, కిషన్‌రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, రాంరెడ్డి, రాజ పాపారెడ్డి సతీశ్, గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ కాలువలో నీటిపారకాన్ని పరిశీలించారు.