సాక్షి, సత్తెనపల్లి: చంద్రబాబు బతుకంతా జనాన్ని మ్యానిపులేట్ చేయాటమేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అద్దంకి మేదరమెట్ల ‘సిద్ధం సభ’లో తాను మాట్లాడింది ఒకటైతే.. దాన్ని మరోలా ఎడిటింగ్ చేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు.
‘లక్షలాది మంది జనాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు. అందుకే గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాల్సిన అవసరం మాకేంటీ?. చంద్రబాబు తన సభలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ చేసుకోవాలి. చంద్రబాబు ఓ మ్యానిపులేటర్. సిద్ధం సభ చూసి ఓర్వలేకపోతున్నారు’ అని అంబటి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment