
April 7th AP Elections 2024 News Political Updates
9:41 PM, April 07 2024
చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
- సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి
- అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు
- ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు
- టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం
- సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు.
- ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
- టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.
- ప్రత్యేక హోదాను ప్యాకేజ్‌గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే
- అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం
- చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్.
- డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం
- పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
- టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి
- చంద్రబాబు రాహుల్‌ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు
- ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి.
- మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
- వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు
- మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా?
- రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా?
- రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు
- టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు
- కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది
9:12 PM, April 07 2024
చంద్రబాబుపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఫైర్
- చంద్రబాబుకి మతిభ్రమించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు
- ఈ పుణ్యభూమిలో చంద్రబాబే ఒక గంజాయి మొక్క
- రాజకీయ వారసత్వం కోసమే చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను హత్య చేశాడా?
- ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
- 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. నిమ్మకూరులో సెంటు స్థలమైనా పేదలకు ఇచ్చాడా?
- పామర్రులో ఐటీ టవర్ కడతానని సొల్లు చెబుతున్నాడు
- అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు
- చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది
- తన సభలకు జనం లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు
- పామర్రులో జనం రాక గంట పాటు బస్సులో పడుకున్నాడు
- పామర్రులో చిన్న అవినీతి లేకుండా 13 వేల ఇళ్ల పట్టాలిచ్చా
- చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 500 కోట్లతో ఇల్లు కట్టుకోవచ్చు
- నేను పామర్రులో ఇల్లుకట్టుకుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు
- ప్రజలను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు తన శాడిజం చూపిస్తున్నాడు
- చంద్రబాబుకి అధికారం దక్కుతుందనేది కలే
- ఎస్సీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
- ఎస్సీల గురించి పలకడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు
7:53 PM, April 07 2024
మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. (ఏప్రిల్ 8) రేపటి షెడ్యూల్
- సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు
- ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు
- అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు
- అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు
- తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు
6:30 PM, April 07 2024
పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు: ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్
- పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి
- ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి
- మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే
- జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు
- చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే
- చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు
- చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడు
- అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు
- వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు
- ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు
- వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు
- చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి
- వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు
- ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు
- వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి
- అందుకే వాలంటీర్‌లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు
- అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు
- పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు
- ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
- పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
- పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు
- వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు
- ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు
- ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు
- పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి
- వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే
- మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు
5:05 PM, April 07 2024
పామర్రులో చంద్రబాబుకు షాక్
- జనం లేకపోవడంతో హెలీ ప్యాడ్ వద్ద బస్సులోనే ఉండిపోయిన చంద్రబాబు
- జనం లేకపోవడంతో షెడ్యూల్ టైమ్ కంటే రెండు గంటలు ఆలస్యంగా పామర్రుకు చేరుకున్న చంద్రబాబు
- చంద్రబాబు మీటింగ్ కు జనసమీకరణలో టీడీపీ నేతలు ఫెయిల్
- పామర్రు టీడీపీ అభ్యర్ధి వర్ల కుమార్ రాజాతో పాటు టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్
- జనసమీకరణ చేయడం చేతకాదా అంటూ చంద్రబాబు అసహనం
2:00 PM, April 07 2024
టీడీపీ తప్పుడు ప్రచారాలపై కేశినేని నాని ఫైర్
- నేను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వచ్చాక నామీద కొన్ని చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి
- సుజనా చౌదరి, పిట్టల దొర చంద్రబాబుకు సిగ్గు ఉంటే నా మీద చేసే ప్రచారాలు నిరూపించాలి
- సుజనా చౌదరి గురించి నాకు 25 సంవత్సరాలు నుంచి తెలుసు
- రాజ్యసభ సభ్యుడు కాకముందు సుజనా ఏం చేశాడో తెలుసు
- రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఏం చేసాడో చెప్తే ఈ పత్రికలన్నీ రాస్తారా?.
- 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు అమరావతి మీద, రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ఫోకస్ విజయవాడ మీద పెట్టలేదు.
- విజయవాడ 60 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది
- 2018 నాతో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఎన్డీయేలో నుంచి బయటికి వచ్చి మోదీని నానా మాటలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు
- అమరావతికి నిధులు ఇవ్వలేదని మోదీని ఎన్నో మాటలు అన్న వ్యక్తి చంద్రబాబు
- మోదీ, చంద్రబాబు అప్పుడు ఎందుకు విడిపోయారు.. ఇప్పుడు ఎందుకు కలిశారు.
- అప్పుడు ఇవ్వని నిధులు ఇప్పుడు ఇస్తా అన్నాడా?.
- విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇస్తానని మోసం చేసిన పార్టీ టీడీపీ.
- విజయవాడ పశ్చిమ సీటు బీసీలకు ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
- సుజనా చౌదరి నీ బ్యాంకు దోపిడీలు, నీ వ్యాపారాలు, నీ కేసులు అన్ని నాకు తెలుసు
- చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును బడాబాబులకు ఇచ్చారు.
- సీఎం జగన్ మాత్రం ఒక సామాన్య కార్పొరేటర్‌గా ఉన్న అసిఫ్‌కి సీటు ఇచ్చారు
- నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా.. కేశినేని భవన్ అంటే విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు
1:50 PM, April 07 2024
అభివృద్ధి చూసి ఓటెయ్యండి: ఎమ్మెల్యే రాచమల్లు
- ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారం
- టీడీపీ హయాంలో ప్రొద్దుటూరులో ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు
- అలా చేసి ఉంటే నేను నామినేషన్ వేయను
- వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్లతో మంచినీటి సమస్య పరిష్కారం చేశాము.
- రూ. 450కోట్లతో అభివృద్ధి పనులు చేశాం.
- 24వేల మందికి స్థలము కొని వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేశాము
- నేను నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేసి గెలిపించండి
- మళ్ళీ వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ తెస్తామని హామీ ఇస్తున్నాను.
1:30 PM, April 07 2024
టీడీపీ, జనసేనకు షాక్
- కృత్తివెన్ను మండలంలో టీడీపీ,జనసేనకు షాక్
- టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన చిన్నపాండ్రాక గ్రామానికి చెందిన 50 కుటుంబాలు
- పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము సమక్షంలో చేరిక
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము
12:45 PM, April 07 2024
టీడీపీపై అశోక్ గౌడ్ ఫైర్
ప్రకాశం..
- డబ్బు ఉన్న వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
- టీడీపీలో బీసీలను అన్యాయం జరుగుతోంది.
- సీఎం జగన్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారు.
- టీడీపీ నేతలే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
12:20 PM, April 07 2024
పవన్, చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్
- టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు.
- అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరు.
- మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు.
- చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్.
- సందుల్లో మీటింగ్‌లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు.
- ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు.
- చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు.
- లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు.
- వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి.
- చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు.
- చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?.
- తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు.
- చంద్రబాబు, పవన్‌లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు.
- సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు.
- కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు.
- పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని.
- ఇది గతంలోనే కన్నా చెప్పారు.
- విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను.
- సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు.
- 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు.
- సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ విజయాన్ని తేల్చేశాయి.
- ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.
- కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే.
- పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు.
- అసలు పవన్‌కు రాజకీయాలు ఎందుకు?.
- రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు.
- రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు.
- డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు.
- చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?.
- చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది.
- సంక్రాంతికి డాన్స్‌లు చేస్తే తప్పేంటి?.
- పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?.
- చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్‌ను కాదు.
- రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు.
- పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే.
11:35 AM, April 07 2024
వైస్సార్‌సీపీలోకి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరికలు..
- సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు
- వైఎస్సార్‌సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు.
- టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్ వైఎస్సార్‌సీపీలో చేరిక.
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డీవీఆర్‌కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌లు వైఎస్సార్‌సీపీలో చేరిక
- బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ వైఎస్సార్‌సీపీలో చేరిక.
- పార్టీ జెండాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించిన సీఎం జగన్
11:15 AM, April 07 2024
ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోతుంది: దేవినేని అవినాష్
- ప్రతీ డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నాం
- ఏ ముఖంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతారు
- గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారు
- హుందాతనం కోల్పోతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా?.
- రాష్ట్రంలో గంజాయికి ఆధ్యులు తెలుగుదేశం నేతలు కాదా.
- గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా?.
- సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు.
- గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు
- 650 హామీలు నెరవేర్చామని టీడీపీ నేతలు చెప్పుకోగలరా?
- సీఎం జగన్ మేనిఫెస్టో నవరత్నాలు అన్నీ అమలు చేశాం అని ధైర్యంగా చెప్పగలం
- పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారు.. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి
- చంద్రబాబు సొంత మనిషి నిమగడ్డ కాదా?.
- అనునిత్యం వాలంటీర్లపై విషం చంద్రబాబు విషం కక్కుతున్నారు.
- రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయం
- సేవా దృక్పథంతో వున్న వాలంటీర్లను వేధించడం సరికాదు
10:30 AM, April 07 2024
చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా?: మంత్రి పెద్దిరెడ్డి
- ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నాను.
- ప్రతీ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు
- సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు
- చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా ?
- రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ మోసం చేశారు
- రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించారు
- సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఓటు వేయాలని కోరుతున్నారు
- సంక్షేమ పథకాలు వలన రాష్ట్రం శ్రీలంకగా మారిందని చంద్రబాబు విమర్శించారు
- పథకాల వలన రాష్ట్రం దివాలా తీస్తుందని అన్న వ్యక్తి 2.5 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తారా?
- చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. సీఎం జగన్ రైతులకు అండగా నిలబడ్డారు
- ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా మన గ్రామంలోనే సచివాలయంను తీసుకొచ్చారు
- అర్హులైన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకి కూడా సంక్షేమ పథకాలు అందించాం
- జన్మభూమి కమిటీలు ఇంత నిబద్దతతో పని చేశాయా?
- ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు.
- నాడు-నేడు ద్వారా పూర్తి స్థాయిలో పాఠశాలల అభివృద్ది జరిగింది
- చంద్రబాబు మానిఫెస్టోలో ప్రతీ ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ అని కూడా అంటారు
- ఆ హామీలు సాధ్యమైనవా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి
- వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లబ్ది జరిగింది
- ప్రజలు ఆలోచన చేసి సీఎం జగన్‌కు మద్దతు ఇవ్వాలి
- మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరుతున్నాను.
10:10 AM, April 07 2024
టీడీపీ మునిగిపోతున్న నావ: ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు
- టీడీపీ నేతలపై శంకర్‌రావు ఫైర్
- పార్టీ మారుతున్నానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- సీఎం జగన్‌కు భయపడి ముగ్గురు కలిసి వస్తున్నారు.
- రెండు నెలల తర్వాత బాబు, పవన్ ఏపీలో కూడా ఉండరు.
- చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.
- బాబు, పవన్ పర్మినెంట్‌గా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతారు.
09:30 AM, April 07 2024
పదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఇలా..
Memantha Siddham Yatra, Day -10.
— YSR Congress Party (@YSRCParty) April 7, 2024
ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం
సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ
వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX
08:30 AM, April 07 2024
టీడీపీకి షాక్..!
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీకి షాక్
- మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధం.
- రమేష్ రెడ్డితో ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి చర్చలు.
- త్వరలో పార్టీ కండువా కప్పుకోనున్న రమేష్ రెడ్డి.
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సొదరుడు రమేష్ రెడ్డి.
07:50 AM, April 07 2024
చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్న
- అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే..
- ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్‌గా నీ మేనిఫెస్టోను చూపించి..
- ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా?
- చంద్రబాబు నిజంగా ప్రజలకి మంచి చేసి ఉంటే.. మరి మూడు పార్టీలతో పొత్తులు ఎందుకు అని నేను అడుగుతున్నా.
- సిద్ధం సభల నుంచి మీ అందరి ముందు ఇదే ప్రశ్న అడుగుతున్నాను.
- ఇప్పటి వరకు చంద్రబాబు నాకైతే సమాధానం ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా?
అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్‌గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా?#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/tacPwGHyn7
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024
07:40 AM, April 07 2024
మారని బాబు.. మళ్లీ అదే రుబాబు..
- ఈసీ అయినా డోంట్ కేర్... పోలీస్ వ్యవస్థనూ బ్లాక్‌మెయిల్
- ఎన్నికల అక్రమాలే లక్ష్యం.. దుష్ప్రచారమే కుతంత్రం
- నాడూ నేడూ కుట్ర రాజకీయం ఇదే
- ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం
- వాటి తీరుపై ఐపీఎస్ అధికారుల మండిపాటు
- పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు
07:25 AM, April 07 2024
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటర్లు
- ఓటేయడానికి ముందుకు వస్తున్న యువత
- మార్చిలో షెడ్యూల్ తర్వాత కొత్తగా 1.26 లక్షల ఓటర్లు చేరిక
- 2.09 కోట్లకు పెరిగిన మహిళా ఓటర్లు
- 2.01 కోట్లకు చేరిన పురుష ఓటర్లు
- జనవరిలో తుది జాబితా ప్రకటన తర్వాత 2.56 లక్షలు పెరుగుదల
- స్వీప్ ప్రచార కార్యక్రమంతో భారీగా చేరుతున్న కొత్త ఓటర్లు.
07:10 AM, April 07 2024
మోసానికి మారుపేరు చంద్రబాబు: సీఎం వైఎస్ జగన్
- అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు
- కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- అయ్యా చంద్రబాబూ.. మీ పాలనలో గుర్తొచ్చే పథకమేదైనా ఉందా?
- ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
- ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్‌గా చూపావా?
- అంత ధైర్యం, దమ్ము ఉందా?
- చూపవుగాక చూపవు.. ఎందుకంటే చేసిన మంచేమీ లేదు.. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే
- తోడేళ్లు, మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోంది
- ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి.. ఇవి రాష్ట్ర భవిష్యత్, పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు
- మీ ఓటు.. మీ ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. 99 శాతం హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చా
- మీ ఇంట మీకు మేలు జరిగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి
07:00 AM, April 07 2024
లోకేష్‌పై టీడీపీ నేత దన్నుదొర సంచలన వ్యాఖ్యలు
- టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దన్నుదొర సంచలన వ్యాఖ్యలు.
- భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన దన్ను దొర.
- చంద్రబాబు మోసం వలన కుటుంబంతో కలిసి చనిపోవాలనుకున్నాం.
- కార్యకర్తల గురించి ఆలోచించి వెనుకడుగు వేశాను.
- లేదంటే ఈపాటికి మా కుటుంబం శవాలను చూసేవారు.
- చంద్రబాబు సీటు ప్రకటించి మోసం చేశారు.
- కోట్లాది రూపాయలు ఖర్చు చేసి టీడీపీని బలోపేతం చేశాను.
- బలం లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారు
- సీటు కోసం చంద్రబాబు లోకేష్‌ని కలిసినా తేలిగ్గా మాట్లాడారు..
- గిరిజనులు అంటే చంద్రబాబు లోకేష్‌కు చులకన అంటూ విమర్శలు చేశారు
06:55 AM, April 07 2024
సీఎం రమేష్ హల్‌చల్..
- నర్సీపట్నంలో బీజేపీ కార్యకర్తలతో సీఎం రమేష్ మీటింగ్..
- మీటింగ్ వచ్చిన మహిళలకు విచ్చలవిడిగా చీరలు డబ్బులు పంపిణీ..
- ఒక్కో మహిళకు పార్టీ రంగులో ఉన్న చీర, 2000 రూపాయలు పంపిణీ..
- సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు..
- రౌడీయిజం డబ్బుతో రాజకీయం చేస్తున్న సీఎం రమేష్..
- గురువారం డీఆర్ఐ అధికారులను బెదిరించిన సీఎం రమేష్..
- సీఎం రమేష్ తీరుతో భయభ్రాంతులకు గురైన స్థానికులు..
06:45 AM, April 07 2024
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి నోటి దురుసు..
- మరోసారి అయ్యన్న నోటి దురుసు..
- అధికారులపై నోరు పారేసుకున్న అయ్యన్న.
- డిజీ, సీఎస్లను పనికిమాలిన ఎదవలంటూ సంబోధన..
- వారిద్దరినీ మార్చాలన్న అయ్యన్న..
- చీరలు పంచితే పోలీసుల రాద్ధాంతం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం.
- చీరలు పంచామని నిజం ఒప్పుకున్న అయ్యన్న.
06:30 AM, April 07 2024
షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్
- తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి
- ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి
- జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో
- పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు
- జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి
- ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి
- తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో..
- తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి
- కాంగ్రెస్‌ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే
- వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం
- తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం
- కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది
Comments
Please login to add a commentAdd a comment