AP FDC Chairman Posani Krishna Murali Fires On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

అమరావతి రైతులారా మోసపోవద్దు! చంద్రబాబు వేస్ట్‌ క్యాండిడేట్‌.. పోసాని ఫైర్‌

Published Fri, Aug 4 2023 1:19 PM | Last Updated on Fri, Aug 4 2023 2:48 PM

Ap Fdc Chairman Posani Krishna Murali Fires On Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమరావతి భూములపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఆయనకు అసలు సిగ్గుందా అంటూ ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో పేదలు ఉండొద్దనే స్టే తెచ్చానని బాబు చెబుతున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకుంటారా?. చంద్రబాబు కమ్మ కులస్తుడిగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా’’ అని పోసాని వ్యాఖ్యానించారు.

‘‘సీఎం జగన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు సిగ్గులేదా?. బాబు హయాంలో రైతుల ఆత్మహత్యలపై మాట్లాడరా?. బషీర్‌బాగ్‌ రైతులపై కాల్పులు జరిపిన విషయం గుర్తులేదా. చంద్రబాబు ఎలాంటి నీచపు పనులైనా చేయొచ్చా?. చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుంది. రైతులను అడ్డంపెట్టుకుని ఇంత డ్రామా ఆడతారా?. అమరావతి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు మాట వింటే మీరు సర్వనాశనం అయిపోతారు. సీఎం జగన్‌ పాలన బాగాలేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటా’’ అంటూ పోసాని సవాల్‌ విసిరారు.
చదవండి: సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి 

‘‘రామోజీరావు ఒక బ్రోకర్‌. సీఎం జగన్‌పై పడి ఏడవడమే రామోజీ పని. రాధాకృష్ణ సిగ్గులేని వ్యక్తి.. వేలకోట్లు సంపాదించిన బ్రోకర్‌. వీళ్ల లాంటి వారిని ఎక్కడా చూడలేదు. పేపర్‌ను అడ్డం పెట్టకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా. మీ మొహాలపై ఉమ్ము వేసేందుకు కూడా సిగ్గుపడుతున్నా. సిగ్గులేకుండా రైతులను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడి గురించి మాట్లాడటం వేస్ట్‌. అశ్వనీదత్‌కు అమరావతిలో భూములిచ్చావు. చంద్రబాబు లాంటి ఛీటర్‌ ఎక్కడా ఉండడు. లోకేష్‌కు మంగళగిరి పేరు కూడా చదవడం రాదు. ఓడిపోయిన లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చావు’’ అంటూ పోసాని దుయ్యబట్టారు.

‘‘చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తప్పుడు రాతలు రాయించారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ లక్ష్యం. ఎన్టీఆర్‌నే చంపిన దుర్మార్గుడు చంద్రబాబు. చిరంజీవిని ఓడించినా.. పవన్‌ చంద్రబాబు వెనక తిరుగుతున్నాడు. నేను సీఎం రేసులో లేనని పవన్‌ కల్యాణ్‌ చెప్పగలరా?. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం అన్నది పవన్‌ కాదా?. చంద్రబాబును తిట్టి ఇప్పుడు ఆయన వెనుక తిరుగుతున్నావు’’  అంటూ పోసాని కృష్ణమురళీ ధ్వజమెత్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement