
వేములవాడ: కృష్ణా, గోదావరి జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేములవాడలో జరిగిన రాష్ట్రస్థాయి దళితమోర్చా కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదం నడుస్తుండగా, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం, 8 నెలల తర్వాత వెనక్కి తీసుకోవడంలో మతలబేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంలు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment