సాక్షి, కరీంనగర్ జిల్లా: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిస్తుందని.. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని.. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందన్నారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమినే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారన్నారు.
కర్ణాటక, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కి ఇదే గతి పడుతుంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
‘‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను మేము ప్రచారం చేశాం. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు.. చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment