సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన SR గార్డెన్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
తన భూముల్లో ప్రభుత్వం సర్వే చేయించడంపై కాంగ్రెస్ నేత పొంగులేటి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్టేటస్ కో ఆర్డర్ జారీచేసిన హైకోర్టు.. సర్వే చేసి రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని.. అప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సర్కార్‌ను ఆదేశించింది. అగస్ట్ 1వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: నా కొడుకు మన్యం బిడ్డే అంటున్న కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment