పార్టీ సీనియర్ ఎంపీ, మాజీ రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్‌కు గట్టి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని కైర్‌గంజ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు ఈసారి బీజేపీ మొండిచేయి చూపింది. గతంలో భూషన్‌పై జాతీయ స్థాయి రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కైర్‌గంజ్ నుంచి ఆయన కొడుకు కరణ్ భూషన్ సింగ్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.
లోక్‌సభ అయిదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలు చేయడానికి తుదిగడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేడు అభ్యర్థని ప్రకటించింది.
కాగా బ్రిజ్‌భూషన్ సింగ్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. చివరి మూడు సార్లు పర్యాయాల్లో (2009, 2014, 2019) కైసర్‌గంజ్ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే బ్రిజ్‌భూషన్ గత రెండేళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై జాతీయ రెజర్లు చేసిన తీవ్ర ఆరోపణలు అప్పట్లో రాజకీయపరంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో గతేడాది రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ క్రమంలోనే విజయవకాశాలను దెబ్బతీస్తాయనే ఆలోచనతో అభ్యర్థిని మార్చేందుకు మొగ్గు చూపింది. అయితే బ్రిజ్ భూషణ్ సింగ్‌కు స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిని బరిలో దింపింది.
కరణ్ పేరుతోపాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ అభ్యర్థిని సైతం బీజేపీ ప్రకటించింది. రాయ్‌బరేలీలో ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది. ఇప్పటికీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. గతంలో ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment