
గుడివాడ: సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామాకు తెరలేపింది. సంక్రాంతి ముగిసిన పదిరోజుల తర్వాత ముగింపు ఉత్సవాలంటూ గుడివాడలో హడావిడి చేసింది.
గుడివాడలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా బీజేపీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుడివాడ వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను నందమూరు వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.