నేడు రాష్ట్రానికి అమిత్‌ షా | BJP Leader Amit Shah To Visit Telangana | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా

Published Tue, Mar 12 2024 12:59 AM | Last Updated on Tue, Mar 12 2024 1:01 PM

BJP Leader Amit Shah To Visit Telangana - Sakshi

కేంద్ర హోంమంత్రి పర్యటన ఖరారు 

సోషల్‌ మీడియా వారియర్స్, పోలింగ్‌ బూత్‌ విజయ సంకల్ప సమ్మేళనంలో 

పాల్గొననున్న బీజేపీ అగ్రనేత 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం నాటి రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. పర్యటనలో భాగంగా... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్‌ గార్డెన్‌లో బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ మీటింగ్‌లో పాల్గొని వారికి అమిత్‌ షా దిశా నిర్దేశం చేయనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 వరకు ఎల్‌బీ స్టేడియంలో నిర్వ హించే విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆ పై మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు పార్టీ కార్యకర్తలకు ఆయన మార్గ నిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉండడంతో ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తంగా దాదాపు 50–60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. 

రాష్ట్ర నేతలతో భేటీ కానున్న షా 
సమ్మేళనం అనంతరం సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారం, నాయకుల మధ్య మరింత మెరుగైన సమన్వయంపై అమిత్‌ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement