Botsa Satyanarayana Gets Emotional For CM Jagan Words At Vizianagaram Chelluru Meeting, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Botsa Satyanarayana Emotional Video: భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స...

Published Thu, Apr 25 2024 3:03 PM | Last Updated on Thu, Apr 25 2024 3:03 PM

Botsa Satyanarayana Emotional For CM Jagan Words   - Sakshi

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగం అనంతరం విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం, ఎచ్చెర్ల అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, తలే రాజేష్​​, బొత్స అప్పలనరసయ్య, గొర్లె కిరణ్‌కుమార్‌లను ప్రజలకు పరిచయం చేసి సౌమ్యులు, పరిపాలనాదక్షులైన వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. 

అందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement