నన్ను అరెస్ట్‌ చేస్తారని ఎప్పుడో తెలుసు: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments On Revanth Reddy Congress Govt Over Arrests, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

ఎవరిది డ్రామా.. ఎవరి కోసం కుట్ర: కేటీఆర్‌

Published Thu, Nov 14 2024 8:51 AM | Last Updated on Thu, Nov 14 2024 9:50 AM

BRS KTR Sensational Comments Over Congress Govt And Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ కుట్రలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రేవంత్‌.. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు అంటూ కేటీఆర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

‘ఎవనిదిరా కుట్ర?  ఏంది ఆ కుట్ర?

నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?

నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?

గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?

నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?

పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!

మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?

50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?

నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!

నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి!

చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement