సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీల్లో ఒక్కటైన రైతుభరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అలాగే, నిరుద్యోగులకు గాలికి వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, హరీష్ రావు సిద్దిపేటలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అంటూ గొప్పలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా రైతులను కాంగ్రెస్ సర్కార్ నిండా ముంచింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో వాటిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడిచింది. ఆగష్టు నెల వచ్చినా ఇంకా రైతుబంధు డబ్బులే రాలేదని అన్నారు. మరోవైపు, రైతు భరోసా ఊసే లేదని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో నిరుద్యోగులను గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు అంటూ, జాబ్ క్యాలెండర్ అని ఎన్నో బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని అన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment