
సాక్షి, ఖమ్మం: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతుందన్నారు.
74 నుంచి 78 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు భట్టి విక్రమార్క. త్వరలోనే రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇక బీఆర్‌ఎస్ నేతలకు ఓడిపోతామనే విషయం అర్థమైందన్న మల్లు.. బీఆర్‌ఎస్ ఎన్ని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment