కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు | CM Revanth Reddy Serious On MLAs Kaushik and Gandhi Row | Sakshi
Sakshi News home page

లా అండ్‌ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు

Published Fri, Sep 13 2024 9:18 AM | Last Updated on Fri, Sep 13 2024 12:15 PM

CM Revanth Reddy Serious On MLAs Kaushik and Gandhi Row

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం ఉద్రిక్తలకు దారి తీస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్‌13) రాష్ట్ర డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు.

అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని సీఎం ఆరోపించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్‌13)మధ్యాహ్నం శాంతిభద్రతలపై సీఎం రేవంత్‌ రివ్యూ చేయనున్నారు.

శాంతిభద్రతలు చెడగొట్టేవారిని  వదిలేది లేదు: డీజీపీ జితేందర్‌

కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డీజీపీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి.

హైదరాబాద్‌, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్‌ ఉంటుంది. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ  కాపాడాలని సూచించారు. 

ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement