టీడీపీ నేత, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్‌ను నిలదీస్తున్న తమిళ భక్తుడు
సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన భక్తులను కూడా తమ రాజకీయానికి వాడుకోవాలని చూసిన టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కరోనా ఉధృతి తగ్గడంతో పాటు సర్వ దర్శనానికి అనుమతించడంతో మంగళవారం మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. దీంతో సర్వ దర్శనానికి టోకెన్లు జారీ చేస్తున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద రద్దీ ఏర్పడింది. దీన్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
చదవండి: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రతి ఒక్కరికీ తాగునీరు అందేలా ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. పరిస్థితి కాస్త అదుపుతప్పింది. ఇదే సమయంలో టీడీపీ నేత, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ తన అనుచరులతో అక్కడకు చేరుకొని.. భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మీకు వసతి కల్పించలేదు కదా? అంటూ భక్తులను పోలీసులపైకి పురిగొల్పేందుకు యత్నించారు. ఇంతలో తెలుగువారితో పాటు తమిళనాడుకు చెందిన భక్తులు టీడీపీ నేతలపై ఎదురు తిరిగారు. ‘గుక్కెడు మంచి నీరు కూడా ఇవ్వని మీరు.. మమ్మల్ని ఈ విధంగా రెచ్చగొడతారా?’ అంటూ నిలదీశారు. దీంతో అవాక్కయిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment