
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను గురువారం ఈసీ కోరింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 30లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని ఈసీ తెలిపింది.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. కొన్ని నెలల ముందు జరిగిన ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. కరోనా రెండో దశ వ్యాప్తికి దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment