సాక్షి, విశాఖపట్నం: కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. స్టీట్‌ప్లాంట్‌పై అమిత్ షా మాట్లాకుండా వెళ్లిపోయారని అన్నారు. కేవలం విమర్శలు చేసేందుకే అమిత్ షా వచ్చినట్టు ఉంది అని విమర్శలు చేశారు.
కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంతో ఉండాల్సిన సంబంధాల మేరకే వ్యవహరిస్తున్నాం. వైఎస్సార్‌సీపీకి ఏ పార్టీతోనూ పొత్తులేదు. ఏపీకి కేంద్రం ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా?. ఇంతవరకు విభజన హామీలను నెరవేర్చలేదు. డీబీటీ ద్వారా నేరుగా నగదు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఎందుకు మాట్లాడలేదు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయింది. రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు ఎలా ఆశిస్తుంది. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేసింది.. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది.
ఒంటరిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పార్టీ నాయకులు ఇప్పుడు సంబరపడిపోతున్నారు. అందరూ ఏకమైనా ప్రజా బలం మాత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉంది. ఎన్నికలు వస్తున్నాయని బీజేపీ ఇలా విమర్శలు చేస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించక పోతే జనం పట్టించుకోరని అమిత్ ఎపి ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. టీడీపీ అవినీతికి బీజేపీ సమాధానం చెప్పదా?. అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి: మంత్రి కారుమూరి
Comments
Please login to add a commentAdd a comment