రాష్ట్ర ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోనున్న బాధితులకు బీఆర్‌ఎస్ పరామర్శ, ర్యాలీ
హైదర్షాకోట్‌లో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన హరీశ్, సబిత తదితరులు
బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. హైదరా బాద్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూ సీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధి తులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు.
ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటా
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్‌రావు చెప్పారు. ‘ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చి నా, జేసీబీలు వచ్చానా ముందు మమ్మల్ని దా టాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘బలిసినోళ్ల కు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మా త్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.
కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకా లం కల’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొడంగల్ లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్‌కు రావాలని... అర్ధరా త్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.
బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?
ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధా న్యతా లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పా లన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయి లెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నా రని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్‌సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment