సాక్షి, సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాకముందు జొన్న, మక్క గడక తినేవారని.. అన్నం తినడం నేర్పించానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందంటూ హరీష్ మండిపడ్డారు.
కాగా, మంత్రి హరీష్ ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోంది. తెలంగాణలో పండిన వరి ధాన్యం నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలంగాణ రాక ముందు జొన్న, మక్క గడక తినేవారని.. అన్నం తినడం నేర్పించానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.
తెలంగాణలో యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్డెజ్‌లో వెయ్యికోట్లు సబ్సిడీ కింద అందిస్తున్నాము. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీపాలిత రాష్ట్రాల్లో లేవు. కాంగ్రెస్, బీజేపీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment