Rice procurement
-
చంద్రబాబుపై మంత్రి హరీష్ ఫైర్.. కారణం ఇదే..
సాక్షి, సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాకముందు జొన్న, మక్క గడక తినేవారని.. అన్నం తినడం నేర్పించానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందంటూ హరీష్ మండిపడ్డారు. కాగా, మంత్రి హరీష్ ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోంది. తెలంగాణలో పండిన వరి ధాన్యం నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలంగాణ రాక ముందు జొన్న, మక్క గడక తినేవారని.. అన్నం తినడం నేర్పించానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. తెలంగాణలో యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్డెజ్‌లో వెయ్యికోట్లు సబ్సిడీ కింద అందిస్తున్నాము. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీపాలిత రాష్ట్రాల్లో లేవు. కాంగ్రెస్, బీజేపీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో ధాన్యం కొనుగోలు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. తెలంగాణ సర్కార్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పేదలకు బియ్యం అందడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని పీయూష్ గోయల్ విమర్శించారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్ స్టాక్ నిల్వలు సరిగా లేవని అన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే ఈ చర్చ తీసుకున్నామని తెలిపారు. తమ చర్చల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారన్నారు. చదవండి: పంజాబ్‌లో ఎన్కౌంటర్.. సిద్ధూ హత్యకేసులో ఇద్దరు నిందితులు హతం -
తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని తెలిపిన కేంద్రం.. డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది. అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది. అన్న యోజన కింద ఏప్రిల్-మే నెలల కోటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. అయితే ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణను నిలిపివేసినట్లు తెలిపింది. చదవండి: చర్చనీయాంశంగా మారిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరిక 1.. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం 2.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)అమలు చేయకపోవడం 3.. PMGKAY కింద తీసుకున్న కోటా బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం పై కారణాలతో సెంట్రల్ పూల్ సేకరణ నిలిపివేయాల్సి వచ్చిందని, వీటిపై యాక్షన్ టేకెన్ రిపోర్టును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేయాలని ఆదేశించింది. ఆ తరువాత సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టం చేసింది. -
కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించిన ధాన్యాన్ని కొనకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తామనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు ఇది జీవన్మరణ సమస్య అని.. రాష్ట్రాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తున్నవాళ్లం ఈ అంశంపై మౌనంగా చూస్తూ ఉండబోమని చెప్పారు. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గతంలోనూ వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధంకావాలి. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆ సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రమే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను నిలదీద్దాం. అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేద్దాం. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు..’’అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానితులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఉద్యమాన్ని తలపించేలా.. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగి కరెంటు కష్టాలు తీరడంతో ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు పెరిగిందని.. ధాన్యం కొనుగోళ్ల విషయంగా గత యాసంగి, వానాకాలాల్లో కేంద్రం మెలిక పెట్టడంతో ఇబ్బంది ఎదురైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. తనతోపాటు రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం వైఖరి నిరసిస్తూ ధర్నా చేసినా స్పందన కనిపించలేదని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు ఉన్నా కేంద్ర వైఖరిని దృష్టిలో పెట్టుకుని వరి సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర రైతులు సుమారు 36 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని.. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతులు ఇబ్బందిపడటం ఖాయమని తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ నాయకులు.. ఈ అంశంపై మాత్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో కార్యాచరణ రూపొందించుకుని కేంద్రం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణలో కేవలం పార్టీ యంత్రాంగమే కాకుండా.. రైతులను, వివిధ వర్గాలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. బీజేపీ రాజకీయాన్ని నిలదీయాలి మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం సుదీర్ఘంగా సుమారు నాలుగు గంటలకుపైగా సాగింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తలెత్తే పరిణామాలు, కేంద్రం వైఖరి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏ తరహా కార్యాచరణ చేపట్టాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘‘రాష్ట్రంలో బీజేపీ అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషాన్ని కక్కుతున్న తీరును ప్రజలకు వివరించాలి..’’అని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. జాతీయ రాజకీయాలు, ముందస్తు ప్రస్తావన లేదు! రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్, వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలను మంత్రులతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే జాతీయ రాజకీయాలు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రస్తావనేదీ రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు, సభలతో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అవేవీ పెద్దగా ఫలితం ఇవ్వబోవని అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పరుగుపరుగున ఫామ్‌హౌజ్‌కు.. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, అధికారులు సమావేశానికి రావాలంటూ శనివారం ఉదయమే పిలుపు అందింది. అప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో ఉన్న వీరంతా హుటాహుటిన ఫామ్‌హౌజ్‌కు వరుస కట్టారు. మంత్రులు టి.హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సీఎం భేటీకి వచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల కార్యక్రమంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు అందరికంటే చివరిగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు రావాలని మంత్రులందరికీ అకస్మాత్తుగా పిలుపు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ►ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5.30 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. వ్యవసాయ క్షేత్రంలోనే మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేశారు. స్వల్ప విరామం తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించారు. ►టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం పొద్దునే అమెరికా పర్యటనకు బయలుదేరడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. ►మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పలు అధికారిక కార్యక్రమాల కారణంగా సమయానికి ఫామ్‌హౌజ్‌కు చేరుకోలేకపోయినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఫాం హౌస్‌లో మంత్రులతో ముగిసిన భేటీ.. తగ్గేదేలే అంటున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం అత్యవసరంగా మంత్రులు, అధికారులతో ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు. -
కేంద్రం వద్దంటే నువ్వేం చేస్తున్నట్లు..?: రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చేతగానితనాన్ని ప్రదర్శిస్తుంటే.. ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘రైతు బాంధవున్ని అంటావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులను ఆదుకుం టున్నా అంటావ్. మరి ఇప్పుడు కేంద్రం బియ్యం కొననంటే.. రైతులను ఆదుకునేలా నీ కార్యాచరణ ఏంటి’ అని రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం ఆయన ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వరేసిన రైతులను ఉరేస్తాం అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మెడపై కత్తి పెట్టి రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపైనా రేవంత్ ఘాటుగా స్పందించారు. మెడపై కత్తిపెడితే నీ సీఎం పదవి, ఫాంహౌస్ రాసిస్తవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రానికి ఎలా కట్టబెడతావ్ అంటూ మండిపడ్డారు. కేంద్రం నీ మెడపై కత్తి పెట్టగానే బియ్యం ఇవ్వనని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నావా అని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేసేలా కేసీఆర్ జంతర్‌మంతర్‌లో దీక్ష చేయాలని, కేసీఆర్ సచ్చుడో..కేంద్రం ధాన్యం కొనుగోలు చేసుడో తేల్చుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తామని చెప్పారు. చీకటి రాజకీయాలతో రెండు పార్టీల మోసం.. బీజేపీ, టీఆర్ఎస్లు చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. లోక్‌సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని విమర్శించారు. రైతులపై టీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కవిత, దయాకర్ సభకు ఎం దుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. -
కేంద్రంతో అమీతుమీ.. కేసీఆర్ రెండు రోజుల హస్తిన పర్యటన
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతులు ఏ పంట వేసుకోవాలో చెబుతాం రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడతామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినట్లు మొన్న ఓ గాలివార్త వచ్చింది. ఇది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించాం. ఆయా కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల సాయం చొప్పున మొత్తం రూ. 22.5 కోట్లు అందిస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణతోపాటు నీటి వాటాలు, ఇతర సమస్యలపై కేంద్రంతో తేల్చుకునేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్లి.. ఢిల్లీ రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ చట్టాలు తదితర అంశాలపై ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తేల్చుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై ఉలుకూపలుకు లేదు.. ‘తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఎటువంటి సమాధానం వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి సంవత్సరంలో ఎంత సేకరిస్తారో టార్గెట్ ఇవ్వమని అడుగుతున్నం. దాన్నిబట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్న ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. ఏం మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎంపీల బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల కార్యదర్శుల బృందంతో ఢిల్లీకి వెళ్తున్నం. కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరుతం. అవసరమైతే రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాం. ఆ తరువాత రైతులకు మా విధానం ఏంటో చెపుతం..’అని సీఎం వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలి..వేధింపులు ఆపాలి ‘భద్రతా బలగాల నిర్బంధం, ఒత్తిళ్లు, కేసుల నడుమ 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అద్భుత విజయం సాధించింది. చట్టాలను వెనక్కు తీసుకోవడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఈ ఉద్యమ సమయంలో రైతులపై దేశద్రోహం సహా వేలాది కేసులు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి కేసులను వెంటనే ఎత్తివేసి, రైతులపై వేధింపులను ఆపివేయాలి. కేంద్రం అనుసరించిన దుర్మార్గ విధానాలతో సుమారు 750 మంది రైతులు పోరాటంలో భాగంగా ఆత్మార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్షమాపణలతో చేతులు దులుపుకోకుండా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇచ్చి ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి. రైతులపై కేసుల ఎత్తివేత, రూ.25 లక్షల సాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంటులో కొట్లాడుతం..’అని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి ‘దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర కోసం దేశంలోని 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్’తరహాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మ కృషి నిర్భర్’పథకాన్ని తీసుకురావాలి. వ్యవసాయ చట్టాల తరహాలోనే పార్లమెంటులో పెట్టిన విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కు తీసుకోవాలి. నూతన కరెంటు చట్టం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల మెడపై కత్తి పెట్టడంతో ప్రజలు, విద్యుత్ కార్మికులలో ఆందోళన నెలకొంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నియంతృత్వ పోకడలకు వెళితే రైతులు రోడ్లెక్కుతారు..’అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ట్రిబ్యునల్ వేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకెవడు? ‘నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కొత్త రాష్ట్రానికి నీటి వాటాతో పాటు అనేక అంశాల్లో కేంద్రం తాత్సారం చేస్తోంది. 8 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటా తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలు ఆలస్యమై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కోరడంతో పాటు మూడు నాలుగు నెలల కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని అడుగుతం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడంలో కేంద్రానికి ఏం అడ్డం పడుతోంది. కేంద్రం రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకు ఎవడు? కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆందోళనకు దిగుతాం..’అని చెప్పారు. బీసీ కుల గణన జరపాలి ‘గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభ తీర్మానాలు చేసి పంపింది. దేశంలో బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కులాల లెక్కలు దాచిపెట్టుడెందుకు ? కుల గణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారితీస్తుంది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. పిచ్చిమాటలు వినొద్దు.. రైతులు ఆగం కావొద్దు ‘స్థానిక బీజేపీ నాయకులు పిచ్చిమాటలు కట్టిపెట్టాలి. మీ బండారం బయటపడింది. మీరు చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలి. చిల్లరగాళ్లు చెప్పే మాటలకు రైతులు ఆగం కావద్దు. ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చే క్రమంలో తొందరపడవద్దు. వానాకాలం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు 6,600 కేంద్రాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇస్తున్నం. వర్షాలు పడుతున్నందున కోతలు కోయనివారు రెండు మూడు రోజులు ఆగాలి. లేదంటే ధాన్యం రంగు మారి నష్టపోవలసి వస్తుంది. కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. యాసంగిలోనూ రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు సిద్ధం చేస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఏ పంటలు వేసుకోవాలో రైతులకు చెపుతం..’అని అన్నారు. ఎన్నికలు ఉన్నందునే వ్యవసాయ చట్టాలు వెనక్కి ‘దేశంలోని ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో బియ్యం తినే జనం ఎక్కువ. మన రాష్ట్రంలోనే పీడీఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం అవసరం. 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్రమే చెపుతోంది. కేంద్రంపై పోరాటంలో ఏ సమయంలో ఎవరిని కలుపుకొనిపోవాలో వారిని కలుపుకొనివెళతాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దేశంలో ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు..’అని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పచ్చి బియ్యం.. 40 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాం
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: వరిసాగు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. వానాకాలం (2021–22)లో 40 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం మాత్రమే సేకరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటినుంచి పారాబాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం ఎఫ్‌సీఐ సేకరించదని, కేవలం మిల్లింగ్ చేసిన రారైస్ (పచ్చి బియ్యం)ను మాత్రమే అనుమతి స్తామని పేర్కొంది. దేశంలో పారాబాయిల్డ్ బియ్యం నిల్వలు మరో నాలుగేళ్లకు సరిపడా ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ధాన్యం/ బియ్యం సేకరణపై వివరాలతో ఓ నోట్ విడుదల చేసింది. అయితే గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 90లక్షల మెట్రిక్ టన్నులకు పెంచమన్నారు కానీ.. వానాకాలంలో బియ్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ ద్వారా కోరినట్లు నోట్లో కేంద్రం పేర్కొంది. అయితే తెలంగాణలో 16.90 లక్షల హెక్టార్లలోనే పంట సాగు చేశారని, తద్వారా 54.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. 2016–17 నుంచి 2020–21 వానాకాలం వరకు నిర్దేశించిన పరిమాణానికన్నా అధికంగానే రా రైస్‌తో పాటు పారాబాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేసినట్లు వివరించింది. నోట్లో ఇంకా ఏముందంటే.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తి, వినియోగంలో తేడా ‘దేశ వ్యాప్తంగా పారా బాయిల్డ్ రైస్ ఉత్పత్తి, వినియోగంలో ఉన్న తేడాల నేపథ్యంలో ఉప్పుడు బియ్యం సేకరణను పరిమితం చేశాం. ఈ మేరకు తెలంగాణ నుంచి గత యాసంగి (2020–21)లో 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించాల్సి ఉంది. మిగతాది పచ్చి బియ్యం పంపాలి. అయితే తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు యాసంగిలో అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ఒప్పుకున్నాం. అలాగే ఎఫ్‌సీఐ వద్ద అక్టోబర్ 11 నాటికి పారాబాయిల్డ్ రైస్ స్టాక్ 46.28 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, మరో 32.73 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. అంటే 79 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐ వద్ద ఉన్నప్పటికీ, దేశంలో పారాబాయిల్డ్ రైస్‌ను వినియోగిస్తున్న రాష్ట్రాల ప్రజలకు అవసరమైంది ఏటా కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే ఇప్పుడున్న నిల్వలు మరో నాలుగేళ్ళ వరకు సరిపోతాయి..’ అని కేంద్రం తెలిపింది. ఈసారి ఆంక్షలు విధించాల్సి వచ్చింది ‘తెలంగాణలో పారాబాయిల్డ్ రైస్ పండిం చినా, వినియోగించేది మాత్రం పచ్చి బియ్యమే. అయితే పారాబాయిల్డ్ రైస్ విని యోగించే రాష్ట్రాల్లో కూడా ఆ బియ్యాన్ని పండి స్తుండడంతో ఆ స్టాక్ కదలికలో వేగం లేదు. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు గత ఖరీఫ్ (యాసంగి)సీజన్లో ముందు అనుమతి నిచ్చిన 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు అద నంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు పారా బాయిల్డ్ బియ్యం తీసుకోవడానికి అంగీకరించాం. కానీ ఈసారి వానాకాలం పారాబాయిల్డ్ రైస్ సేకరణపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అలాగే అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో.. ఎఫ్‌సీఐకి పారాబాయిల్డ్ రైస్ పంపిం చం, రైస్‌బ్రాన్ ఆయిల్ పరిశ్రమలకు ప్రోత్సా హకాలు ఇస్తాం, రైస్ మిల్లుల సామర్థ్యం పెం చుతాం, ఎఫ్‌సీఐతో పాటు రాష్ట్రం అవస రాలు తీర్చడానికి బలవర్ధకమైన బియ్యం లభ్యతను సులభతరం చేస్తాం అని పేర్కొంది. ఇతర అంశాలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే చర్యలు తీసుకుంటాం అని తెలిపింది..’ అని వివరించింది. కాగా వానా కాలం సీఎంఆర్ గడువును అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022గా నిర్ణయించారు. -
కొట్టుకున్నట్లు నటిస్తూ రైతులను చంపుతున్నారు..
రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టుకున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఆందోళనకారులు ముట్టడించారు. సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాలు పోటీ పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నా యని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టు కున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరే ట్ను ముట్టడించారు. అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ గార్డెన్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 గంటల ధర్నా అనంతరం కాంగ్రెస్ నేతలు వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను కేంద్రమే కాపాడుతోంది సహారా కుంభకోణంలో జైలుకు వెళ్లకుండా కేసీఆర్‌ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతున్నారు. రైతులకు మేలు చేయాలంటే వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యం చూడాలి. ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తే రైతులుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో తిరిగి ఏం ఉద్ధరిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కేసీఆర్ కార్యాచరణ ఏంటో ప్రకటించాలి. జంతర్‌మంతర్ వద్దకు ధర్నా చేయగలవా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగలవా?’ అని రేవంత్ అన్నారు. చైనా, పాకిస్తాన్ కొంటాయా: భట్టి రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు కాకుంటే.. చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా దేశాలు కొంటాయా అని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్కార్ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కేసీఆర్‌కు పాలన చేతగాకుంటే దిగిపో వాలి. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన ప్రభుత్వాల ను ఇప్పటివరకు చూడలేదు. కేసీఆర్ పాలనలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాయని, డ్రామాలు ఆపి వడ్లు కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
ఉప్పెనలా వస్తం..కేంద్రం దిగొచ్చేదాకా పోరు:: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కుటిలనీతి, దుర్మార్గ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయా లని కేంద్రాన్ని పదేపదే అడుగుతున్నా పట్టించుకో వడం లేదని.. పైగా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో మహాధర్నా చేపట్టామని.. కేంద్రంపై యుద్ధానికి ఇది ఆరంభమేనని చెప్పారు. హక్కులను కాపాడ టం కోసం ఉత్తర భారత రైతులను కలుపుకొంటామని.. కేంద్రం ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉప్పెనలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 100% ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై కేసీఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. రైతులను వరి పంట వేయమంటారా, వద్దంటారా స్పష్టంగా చెప్పాలని.. లేకపోతే తప్పు చేశామని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు అంశం రైతుల జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. ధర్నాలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతుల బాధను దేశానికి తెలిపేందుకే.. ‘తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలతో కేంద్రం మభ్యపెడుతోంది. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఆ తర్వాత సీఎం హోదాలో నేను కేంద్రాన్ని కోరి 50 రోజులు కావస్తున్నా ఉలుకూపలుకూ లేదు. వరిసాగు వద్దని రైతులకు చెప్పడం ఇష్టం లేకున్నా.. ఒకేసారి ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే కష్టమే అయినా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరి వద్దని చెప్తున్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించకున్నా.. రాష్ట్ర బీజేపీ వరి వేయండి అని రైతులకు చెప్తూ మభ్యపెడుతోంది. మన రైతుల బాధ దేశానికి, ప్రపంచానికి తెలియచేసేందుకే మహాధర్నా చేపట్టాం. ఇదేకాదు భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతుంది. కొనుగోలు బాధ్యత కేంద్రానిదే.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చుకుని పంటలు పండిస్తు న్నాం. దేశంలో పంటలను కొనుగోలు చేసి, నిల్వచేసే బాధ్యత కేంద్రానిదే. దేశంలో ఆహార కొరతను తీర్చేలా ధాన్యం కొనుగోళ్లకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమ లు చేయకపోయినా.. కొత్త రాష్ట్రం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నాం. వరి వేయాలని కేంద్రం చెప్తే.. విత్తనాలు, ఎరువులు అన్నీ ఇచ్చి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయించాం. గత యాసంగికి సంబంధించి 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మీరు తీసుకోకపోతే మా రైతుల చుట్టూ దిష్టితీసి ఆ బియ్యాన్ని మీ బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తం. అబద్ధపు ప్రచారాలతో: బీజేపీ.. అడ్డగోలు అబద్ధాలతో, వాట్సా ప్, ఫేస్బుక్లో వితండ వాదాలతో వ్యక్తుల కేరక్టర్ దెబ్బతీసే ప్రచారాలు చేస్తూ పాలించాలని అనుకుంటోంది. సీఎం, మంత్రి పదవుల కోసం మేం భయపడే రకం కాదు. ఉద్యమ సమయం లో పదవులను చిత్తు కాగితాల్లా భావించి.. రాజీనామా చేశాం. బీజేపీది రాజకీయ డ్రామా.. ఉత్తర భారత్ రైతు ఆందో ళనలను అణిచివేస్తూ కార్లు ఎక్కించి చంపుతున్నవారు.. ఇక్కడ మన కల్లాల దగ్గర రాజకీయ డ్రామా ఆడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబ ల్ హంగర్ ఇండెక్స్) సర్వే లో 116 దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే అట్టడుగున భారత్ 101వ స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో 12 కోట్ల రైతులు, 40 కోట్ల ఎకరాల భూమి, జీవనదులు, అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నరు. బంగారు పంటలు పండే అవకాశం ఉంది. దేశ జనాభాలో సగం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. చిప్పపట్టుకుని, బిచ్చమెత్తుకుని బతిమిలాడితే మన సమస్యలకు పరిష్కారం దొరకదు. దేశానికి అన్నం పెడతామంటే ఇంత అరాచకమా? దేశం మూగబోతోంది. మాట్లాడితే కేసులు పెడతాం అంటున్నారు. కేసీఆర్ అలా భయపడే వాడే అయితే తెలంగాణ వచ్చేదే కాదు. మేం పదవుల కోసం, కేసుల కోసం భయపడేవాళ్లం కాదు. – కేసీఆర్ రైతాంగ ఉద్యమం రగలాలి దేశంలో కరెంటు, నీళ్లు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడాలి. మరో పోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో కచ్చితంగా ఉద్యమ జెండా ఎగసి.. రైతాంగ ఉద్యమం రగలాలి. దానికి తెలంగాణ నాయకత్వం వహించాలి. రాజకీయం పక్కన పెడితే రణంలో టీఆర్ఎస్ను మించిన పార్టీ లేదు. దేనికీ భయపడకుండా ముందుకు సాగుతాం. గ్రామాల్లో చావు డప్పు కొడతాం. చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య. ధాన్యం కొనుగోలు చేయక పోతే.. రైతులు విషం తాగాలా? చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? మీ దుర్మార్గ చట్టాల కింద ప్రజలు నలిగి నాశనమవ్వాలా? ప్రధానికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. యాసంగిలో వరి పంట వేయాలా వద్దా చెప్పండి. లేదంటే మా చావు మేము చస్తాం. రెండు రోజులు వేచి చూసి యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేస్తాం. ఎందాకైనా తీసుకెళ్తాం. రాజకీయ కొట్లాటను పక్కనపెట్టి ప్రజల బతుకుదెరువు గురించి కేంద్రం సమాధానం చెప్పాలి. విద్వేషాలతో చిచ్చుపెడ్తున్నరు.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. అక్కర ఉన్నప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంటును వాడుకునే రాజకీయాలకు కాలం చెల్లింది. మీ సర్జికల్ స్రైక్‌లు, మీరు సరిహద్దులో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలయ్యాయి. ఈ దేశానికి మంచి చేసే ఉద్దేశం, ఆ సంస్కారం బీజేపీకి లేదు. ఎన్నికలొస్తే భైంసా, పాకిస్తాన్ వంటి సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తూ, అందులో తెలంగాణను కూడా భాగస్వామిని చేస్తోంది. ఈ దేశం ఎటుపోతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజుతో వంద మందితో ప్రారంభమైన పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తాం. మోదీ విధానాల వల్లే ఇలా.. తెలంగాణ పోరాటాలు, విప్లవాల గడ్డ. పోరాటంతోనే పరాయి పాలన విషకౌగిలి నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా ఎలా రక్షించుకోవాలో తెలంగాణకు తెలుసు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ యాత్ర చేస్తాం. ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందా అంటూ వ్యాఖ్యానించారు. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ 51 గంటల ధర్నాకు కూర్చున్నారు. మోదీ విధానాల వల్లే సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది.’’ -
మా ధనం కావాలి.. ధాన్యం వద్దా..? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
సిరిసిల్ల: ‘రాష్ట్రం పన్నుల రూపంలో అందించే ధనం కావాలి.. కానీ మా రైతులు పండిస్తున్న ధాన్యం మాత్రం వద్దా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని ప్రశ్నిం చారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశానికి ఆర్థికంగా అండగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రాష్ట్రం అతిపెద్ద ఆర్థిక వనరుగా అవతరించిందని ఆర్బీఐ నివేదికే చెబుతోందని పేర్కొన్నారు. ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ సాయమూ చేయలేదన్నారు. కాళేశ్వరం కట్టినా పైసా ఇవ్వలేదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేం త వరకు వరి వేయొద్దని మంత్రి రైతులను కోరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఉలుకూ.. పలుకులేదన్నారు. కేంద్రం వైఖరిని దేశం ముందు ఉంచేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గురువారం ధర్నా చేస్తున్నారని తెలిపారు. వానాకాలం వడ్లు కొంటున్నాం.. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం వడ్లను కొంటున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పుష్కలమైన సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలా నష్టం చేస్తుందని, ఈ విషయంలో రైతన్నలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి మృతిచెందిన పిల్లల కుటుంబాలను మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం పరామర్శించారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న జడల వెంకటసాయి, సింగం మనోజ్‌కుమార్, తీగల అజయ్‌కుమార్, శ్రీరాముల క్రాంతికుమార్, కొంగ రాకేశ్ కుటుంబాలను ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఉన్నారు. -
హైదరాబాద్‌లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి.. కేసీఆర్‌కు తమ్మినేని హితవు
నల్లగొండ టౌన్: కేసీఆర్ హైదరాబాద్‌లో ధర్నా చేయడం కాదని, చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలు పుకొని ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా కలసి పోరాడటానికి సిద్ధమని స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో సీపీఎం జిల్లా మహాసభలను ప్రారంభించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ పాలన సాగట్లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే అనుకూల పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలిస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి రాష్ట్రమంతా పచ్చగా ఉందని చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టం పేరుతో దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోం దని తమ్మినేని విమర్శించారు. -
ఏ మేర ధాన్యం సేకరిస్తారో ముందే నిర్ధారించండి.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వచ్చే యాసంగిలో తెలంగాణలో ఎంతమేర వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు గత యాసంగి (2020–21) సీజన్లో సేకరించకుండా మిగిలిన 5 లక్షల టన్నుల ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కోరారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల టన్నుల నుంచి పెంచాలని.. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ ప్రస్తుత (2021–22) వానాకాలం పంటలో 90 శాతం మేర సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ మూడు ప్రధాన అంశాలపై వెంటనే చర్యలు తీసుకునేలా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని ఆదేశించాలని అందులో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన, లేఖలోని ముఖ్యాంశాలివీ.. ఎఫ్‌సీఐ తీరు అయోమయం ‘‘సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన ఎఫ్‌సీఐ.. అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ అటు రైతులను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తోంది. ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఎఫ్‌సీఐ ఒకేసారి నిర్ధారించడం లేదు. ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతోందని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు. ఎఫ్‌సీఐ అనుసరిస్తున్న ఈ రెండు అయోమయ విధానాలు రైతులకు సరైన పంటల విధానాన్ని వివరించడానికి ప్రతిబంధంగా మారాయి..’’ అని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021 వానాకాలంలో తెలంగాణలో 55.75 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయితే, కేవలం 32.66 లక్షల టన్నుల (59 శాతం)ను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించిందని.. 2019–20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే అది 78% తక్కువని వివరించారు. ధాన్యం సేకరణలో ఇలా విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్ధమైన పంట విధానాలను అమలు చేయలేమని తెలిపారు. ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్థారించాలని కోరేందుకు తాను స్వయంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కలిశానని గుర్తుచేశారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసి 50 రోజులు దాటిపోయినా.. ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇప్పటికైనా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు. ఎఫ్‌సీఐ ఓసారి మామూలుగా, మరోసారి అతితక్కువగా ధాన్యం కొంటోంది. దీనివల్ల అయోమయం నెలకొని రాష్ట్రంలో సరైన పంట విధానాలను అమలు చేయలేకపోతున్నాం. ఎంత ధాన్యం కొంటారో ముందే నిర్ధారించండి. పంజాబ్‌లో కొంటున్న తరహాలో మొత్తం పంటలో 90 శాతం మేర సేకరించండి. – మోదీకి లేఖలో సీఎం కేసీఆర్ నేడు సీఎం, మంత్రుల నిరసన ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరేమిటో వెల్లడించాలన్న డిమాండ్‌తో గురువారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తిచేసింది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో జరిగే ఈ మహా«ధర్నాలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి చైర్మన్లు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. గవర్నర్‌కు వినతిపత్రం: గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలను వివరించాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు. ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తదుపరి కార్యాచరణను గురువారం నాటి మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బలప్రదర్శన కాదు: హరీశ్‌రావు ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న ధర్నా తమ బలప్రదర్శన కాదని, రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిరసన చేపడుతున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోవాలనే డిమాండ్‌తో ధర్నా చేస్తున్నామని తెలిపారు. గతంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం ఒకేలా వ్యవహరించాలని, స్పష్టమైన వైఖరి ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, జోగు రామన్న ఉన్నారు. -
‘కేంద్రం నుంచి స్పష్టత కోసం ధర్నా నిర్వహిస్తాం’
ఇందిరా పార్క్ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వరి వేసుకోవాలో.. వద్దో, ధాన్యం కొంటరో కొనరో కేంద్రం స్పష్టం చేయాలి. ధర్నా ముగిసిన అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తాం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి పంట సాగుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఈనెల 18న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ధర్నా చేపడుతుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందిరా పార్కు వద్ద ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగే ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తర్వాత కేంద్రం స్పందన కోసం రెండు రోజులు వేచిచూసి, రైతులు యాసంగిలో ఏ పంట వేసుకోవాలో స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి తమ వైఖరిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తూర్పార పట్టారు. రైతుల ప్రయోజనాల కోసం ఎందాకైనా.. ‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో నీతి, పూటకోమాట అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎంతదాకైనా వెళ్తుంది. బీజేపీని విడిచిపెట్టదు. ధర్నాల డ్రామాలతో బీజేపీ తప్పించుకోలేదు. టీఆర్ఎస్ వెంటాడి వేటాడుతుంది. రాష్ట్రం నుంచి సంవత్సర కాలానికి ఎంత ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరితే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. కేంద్ర మంత్రి చెప్పే మాటలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పే మాటలకు పొంతన లేదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలతో కేంద్రం, బీజేపీ ఆటలాడుకుంటున్నాయి. ధర్నా తరువాత కూడా కేంద్రం దిగిరాకపోతే టీఆర్ఎస్ తన కార్యాచరణ ప్రకటిస్తుంది. ఈ నెల 18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. ప్రధానికి, మంత్రికి లేఖ రాస్తా ‘సంవత్సరానికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివరాలను రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని ప్రధానమంత్రికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తా. మాకు సమాధానం కావాలి. పెండింగ్ పెడతామంటే కుదరదు. ఉలకం పలకం అంటే ప్రజలే తేల్చుకుంటరు. వరి వేసుకోవాలా వద్దా? ధాన్యాన్ని కొంటరా..? కొనరా? దీనిపై కేంద్రం తన విధానాన్ని స్పష్టం చేయాలని అడుగుతున్నం. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు. వానాకాలం పంట 60 లక్షల ఎకరాల్లో ఉంది. 20 లక్షల టన్నులు తీసుకుంటమని చెప్పిన్రు. ఇప్పటివరకు ఏం చెప్తలేరు..’ అని విమర్శించారు. కేంద్ర వైఖరి వల్లే వరి వద్దంటున్నాం.. ‘గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం. నీటి తీరువా లేకుండా ఉచిత విద్యుత్తుతో రైతుకు అండగా నిలిచాం. సాగునీటితో పంటల స్థిరీకరణ చేసుకున్నాం. యాసంగి పంటకు కూడా రైతుబంధు డబ్బులు ఇస్తం. కేంద్రం వైఖరి సరిగా లేదు కాబట్టే యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా..’ అని సీఎం చెప్పారు. ఐదు రోజుల్లో చెబుతామన్నారు కానీ.. ‘రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత, దేశ ఆహార అవసరాల నిమిత్తం బçఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. వడ్లు కొంటే ప్రాసెసింగ్‌లో భాగంగా బియ్యంగా మార్చడమూ కేంద్రం పనే. ఎఫ్‌సీఐ గోడౌన్లు ధాన్యాన్ని నిల్వ చేయాలి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతే. కానీ రాష్ట్రానికో నీతి, ప్రాంతానికో నీతి అనే పద్ధతిలో కేంద్రం ఉంది. పంజాబ్‌లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్నారు. మన వద్ద నిరాకరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఆహార మంత్రిని కలిసి మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని స్వయంగా నేనే అడిగాను. మరుసటి రోజు ఎఫ్‌సీఐ, ఆహార శాఖ అధికారులతో చర్చించారు. తర్వాత మంత్రులతో చర్చించి ఐదు రోజుల్లో చెప్తామని చెప్పారు. కానీ ఈరోజు వరకు ఉలుకుపలుకు లేదు. అనూరాధ కార్తెలో రైతులు నాట్లు పోస్తరు. ఈనెలలోనే వస్తుంది. ఈలోపు తేల్చి చెప్పే బాధ్యత కేంద్రంపైన ఉంది..’ అని కేసీఆర్ అన్నారు. ఎఫ్‌సీఐ కొంటామంటే కేంద్రం వద్దంటోంది... ‘గత యాసంగిలో వడ్లు కొంటామని ఎఫ్‌సీఐ చెపితే కేంద్రం నిరాకరించింది. అప్పుడు కేంద్రాన్ని నిలదీశాం. కేంద్రం ఆలస్యం చేస్తోంది. రైతుకు వ్యతిరేకంగా కేంద్రం ఉంది. దీంతో మేం అప్రమత్తమయ్యాం. మీరు ధాన్యం పండించకండి. పంట మార్పిడి చేయండి అని వ్యవసాయ శాఖ మంత్రి మన రైతులకు విజ్ఞప్తి చేశారు. గత యాసంగిలో తెలంగాణలో వచ్చిన ధాన్యాన్ని జూనియర్ కాలేజీలు, రైతువేదికలు, ఫంక్షన్ హాల్స్‌లో నిల్వ చేశాం. ఆ ధాన్యం ఇప్పటికీ గోదాముల్లోనే ఉంది. గత యాసంగిలో 5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు మాట్లాడుతలేదు..’ అని విమర్శించారు. రాజ్యమేలుతున్నారా.. డ్రామాలాడుతున్నారా? ‘గత యాసంగిలో 80:20 నిష్పత్తిలో బియ్యం తీసుకుంటమని చెప్పి, 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 24 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొని 26 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోలేదు. అవి కూడా కొనాలంటే...వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ పండించబోమని హామీ ఇస్తే తీసుకుంటామన్నారు. ఉన్న బియ్యం నిల్వలు మీద పడతాయని, అప్పటికప్పుడు అండర్ టేకింగ్ ఇచ్చాం. బాయిల్డ్ రైస్ కాదు.. సంతవ్సరానికి రా రైస్ ఎంత కొంటారో అనేదైనా స్పష్టంగా చెప్పమని కేంద్ర మంత్రిని అడిగి 50 రోజులు గడిచినా సమాధానం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయమని ఎట్ల చెపుతడు? రా రైస్ ఎంత తీసుకుంటరో చెప్పమని అడిగినా ఎందుకు సమాధానం చెప్పుతలేరు. రాజ్యమేలుతున్నారా? డ్రామాలాడుతున్నారా?..’ అని నిలదీశారు. యాసంగి వరిపై సంజయ్ స్పష్టత ఇవ్వాలి ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ యాసంగిలో వరి పంట వేయాలని రైతులను రెచ్చగొట్టారు. దీంతో కేంద్రమంత్రికి నేనే స్వయంగా ఫోన్ చేసి.. సంజయ్ మాటలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అలా అనకూడదని కేంద్రమంత్రి అన్నారు. తెల్లారి నేనే ప్రెస్‌మీట్ పెట్టి బండి సంజయ్‌ను అడిగాను. యాసంగిలో వరి వేయమని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటావా? లేక తప్పయిపోయింది అని రైతులకు క్షమాపణ చెపుతావా? అని అడిగిన. కానీ స్పందన లేదు. ఇప్పటికైనా బండి సంజయ్ స్పష్టత ఇవ్వాలి. వరి వేస్తే కేంద్రం కొంటుందా లేదా తేల్చకుండా రైతులతో రాజకీయం చేస్తున్నాడు..’ అని కేసీఆర్ మండిపడ్డారు. వడ్లు కొంటరా కొనరా అనడుగుతె కొడతరా? ‘ఈ వర్షాకాలం పంటను కొంటామని, కేంద్రం నిర్ణయంతో యాసంగిలో వరి పంటను కొనలేమని చెప్పాను. వర్షాకాలం పంట కోసం 6 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారు. ధాన్యం కొనకుండా రాజకీయం చేస్తే రైతులు ఊర్కుంటరా? తిరగబడతరు? నిరసన వ్యక్తం చేస్తరు. వడ్లు కొంటరా కొనరా అనడుగుతె కొడతరా? కొనుగోలు కేంద్రం దగ్గర నీకేంపని? ఏం పగులగొడతనని పోయినవ్? రాళ్లతో రైతులపై దాడులు చేస్తరా? యాసంగిలో వరి వేయమని చెప్పింది నువ్వు కాదా? ఆ మాటకు కట్టుబడి ఉన్నవా? కాదంటే తప్పయిందని చెంప లేసుకొని ముక్కు నేలకు రాయాలి. అసలు వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్నైనా కొంటరా లేదా అని అన్నావా? పిచ్చి పిచ్చి, అర్థరహిత మాటలు, క్షమించరాని మాటల్ని సీరియస్‌గా తీసుకుంటం. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని చెపుతున్నరు? టీఆర్ఎస్ కార్యకర్తల్లో రైతులు లేరా? పంట పండించరా? స్పష్టమైన వైఖరి చెప్పమని అడుగుతరు? అది చెప్పకుండ రైతులపై దాడులు చేస్తమంటే ఎట్లా?..’ అని ప్రశ్నించారు. కేంద్రం నల్లచట్టాలను వ్యతిరేకించినం.. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినం. మాకు స్టాండ్ లేదని ఎవరు చెప్పారు..? లోక్‌సభ, రాజ్యసభల్లో మా పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా గొంతు వినిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చాలాసార్లు వ్యవసాయ నూతన చట్టాలను వ్యతిరేకించారు. ధర్నాలు చేసినం..’ అని కేసీఆర్ తెలిపారు. ‘శాంతి భద్రతల సమస్యగా బీజేపీ మారితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కేంద్రం వడ్లు కొంటనంటే కేసీఆర్ వద్దంటడా? తెలంగాణ ఉద్యమకారుల గడ్డ. వడ్ల విషయంలో తెలంగాణ బీజేపీని నిలదీస్తది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
రాష్ట్రానికి ‘లెవీ’ గండం..!
⇒ 25 శాతం కొనసాగింపునకు కేంద్రం విముఖం ⇒ ఇప్పటికే పచ్చి బియ్యం సేకరణ నుంచి తప్పుకున్న ఎఫ్‌సీఐ ⇒ క్రమంగా ఉప్పుడు బియ్యం సేకరణ నుంచీ తప్పుకునే యోచన ⇒ ఇక ధాన్యం సేకరణ భారమంతా రాష్ట్రాలపైనే ⇒ పౌర సరఫరాలశాఖపై ఏటా అదనంగా రూ.100 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కితగ్గేలా లేదు. దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంపై లెవీ భారం ఎక్కువగా ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం లేవీ విధానాన్ని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా ఇంతవరకు ఏ స్పందన లేదు. దీంతో రైతులకు మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోనున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌కు ముందు వరకు 75 శాతంగా ఉన్న లెవీని 25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బియ్యం లెవీని 25 శాతానికి తగ్గించడం వల్ల మిల్లర్లు తమకు ఉన్న నిల్వ సామర్థ్యం మేరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మిగతా మొత్తాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా రావడంతో కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం 1,500 వరకు పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 25 శాతం లెవీ ఎత్తేస్తే మరింత భారం: ప్రస్తుతమున్న 25 శాతం లెవీనీ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్రంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తులో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంలో ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే చిన్నకారు రైతులు, నిల్వ సామర్థ్యం లేని వారికి మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధర దక్కే అవకాశాలుండవు. లెవీ ఎత్తివేతపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని భావిస్తున్న పౌరసరఫరాలశాఖ పూర్తి బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. మొత్తంగా రబీలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనాపై ఖరీఫ్‌లో ఏర్పాటు చేసిన 1,581 కొనుగోలు కేంద్రాలకు మరో 500 కేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన కేంద్రాలకు అనుగుణంగా గోనె సంచులు, టార్పాలిన్లు, జల్లెడపట్టే యంత్రాలు, మార్కెట్ యార్డుల్లో మరిన్ని వసతులకు కలిపి ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. పూర్తిగా తప్పుకోనున్న ఎఫ్‌సీఐ రాష్ట్రంలో గత ఏడాది మార్చి వరకు కేవలం కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణ వికేంద్రీకరణను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. దీంతో పచ్చి బియ్యం సేకరణ నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పూర్తిగా తప్పుకున్నట్లైంది. 2012-13లో 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర పచ్చి బియ్యం సేకరణ జరిపిన ఎఫ్‌సీఐ, 2013-14లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. 2014-15లో పచ్చి బియ్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం ఉప్పుడు బియ్యం సేకరణకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పచ్చి బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరిస్తోంది. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై ధాన్యం సేకరణ భారం భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో లెవీ పూర్తిగా ఎత్తేస్తే ఉప్పుడు బియ్యం సేకరణ నుంచి కూడా ఎఫ్‌సీఐ వైదొలిగే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఉప్పుడు బియ్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రభుత్వం ముందున్న ప్రశ్న.