సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను డిప్యూటీ సీఎంను చేయాలనే వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు జనసేన నేతలు కౌంటరిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి వ్యాఖ్యలపై జనసేన(janasena) నాయకుడు కిరణ్ రాయల్ కౌంటిరచ్చారు. తాజాగా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కూడా ఉంది. టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. తమ నేత భద్రత పార్టీకి ఎంతో అవసరం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, జనసేన నేత వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు.. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా విశాఖలో హోంమంత్రి అనితను లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవిపై మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలో నారా లోకేష్‌కి మద్దతు తెలపని హోంమంత్రి అనిత. ఈ సందర్బంగా అనిత.. అంతా దైవేచ్చ.. నుదుటి మీద రాసి పెట్టి ఉందేమో చూద్దాం.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment