
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7 వేల కోట్లు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించడాన్ని మంత్రి కె.తారకరామారావు తీవ్రంగా తప్పుబట్టారు. కోవిడ్–19 కోసం రాష్ట్రానికి మొత్తం కలిపి రూ.290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రాతపూర్వకంగా సమాధానమిచ్చిందని సోమవారం ట్వీట్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిగ్గులేకుండా ఎంతగా దిగజారారో దీని ద్వారా తెలుస్తోందని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment