ఇదేనా పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | KTR Serious Comments On Congress Govt Over HYDRA, Watch Tweet Video Inside | Sakshi
Sakshi News home page

ఇదేనా పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Sun, Sep 8 2024 9:11 PM | Last Updated on Mon, Sep 9 2024 1:01 PM

KTR Serious Comments Congress Govt Over HYDRA

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అంటూ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ సందర్భంగా వర్షంలో తడుస్తున్న ​ప్రజల వీడియోను కేటీఆర్‌ షేర్‌ చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
ఇవ్వాళ రేవంత్ సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీరు
జోరు వానలో 
కనికరం లేని సర్కారు
కర్కశంగా గూడు కూల్చేస్తే
దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో
తలదాచుకుంటున్న అభాగ్యులు.

పేరుకేమో ప్రజా ప్రభుత్వం.
కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు! అంటూ వీడియో షేర్‌ చేశారు.

 

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ చుట్టుపక్కల 40 వేల డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లను నిర్మించిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలాంటి హృదయ విదారక ఘటనలను చూసే పరిస్థితి రాదని అన్నారు. మానవ పునరావాస విధానాలతో బయటకు రావాలని.. ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చి వేసిన విషయం తెలిసిందే. దీంతో, వారు వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకుని తలదాచుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement