సాక్షి,హైదరాబాద్:ప్రజాసమస్యలపై శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం(డిసెంబర్ 6) జరిగిన అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు..తెలంగాణ తల్లి మాకు మ్యాటర్.
తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదు.అసెంబ్లీలో లగచర్ల, గురుకులాలు,వ్యవసాయ సంక్షోభవం,ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం.అసెంబ్లీ,మండలి సమావేశాలు కనీసం నెల రోజులు నిర్వహించాలి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా? ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజపేయి మర్చలేదు. నాలుగేళ్ళ తర్వాత రాజీవ్ రాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటోంది.
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు,అదుపు లేకుండా పోయింది.సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు. రేవంత్ చెప్తే..కేసీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేరు.మర్యాద రేవంత్ అడుక్కుంటే రాదు..ఇచ్చి పుచ్చుకోవాలి.కేసీఆర్‌ను గౌరవిస్తేనే..రేవంత్ రెడ్డిని ఆయన కుర్చీని గౌరవిస్తాం.125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నాడు. హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్‌తోనే అంబేద్కర్,పీవీ విగ్రాహాలను రేవంత్ పట్టించుకోవడం లేదు.తనను యూపీలో తిరగనివ్వడం లేదని మెత్తుకుంటోన్న రాహుల్ గాంధీ..తెలంగాణలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి.తెలంగాణలో నడిచేది ఇందిరమ్మ పాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment