ఏపీలో ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందా? | Letter Of Chief Electoral Officer Delhi Circulated On Election Dates | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందా?

Published Tue, Jan 23 2024 7:04 PM | Last Updated on Sat, Feb 3 2024 9:17 PM

Letter Of Chief Electoral Officer Delhi Circulated On Election Dates - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్‌లో జరగబోతున్నాయా?. దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమైందా?, ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించి వెళ్లిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీ ఫిక్స్‌ చేశారా?, ఇప్పుడు ఇదే టాపిక్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

ఏప్రిల్‌ 16వ తేదీన ఏపీలో ఎన్నికలంటూ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి లేఖ ఒకటి సర్క్యులేషన్‌లో  ఉంది. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ అంటూ ప్రచారం సాగుతోంది. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్‌ డేట్‌గా ఈసీ పెట్టుకున్నట్లు ఆ లేఖలో ఉంది. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం చేస్తోంది. లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. 

ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు ఢిల్లీ సీఈవో లేఖలో పేర్కొన్నారు.

దీనిపై ఢిల్లీ సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ సీఈవో వివరణను ట్వీట్టర్‌లో రీపోస్ట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కాగా, 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 17 వరకు ఏడు దశల్లో  ఎన్నికలు జరగ్గా, 2019 మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. 2019లో మొదటి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement