పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే.. పవన్‌కు అంబటి చురకలు | Minister Ambati Rambabu Comments On Pawan Kalyan Over TDP-JSP Party First List - Sakshi
Sakshi News home page

పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే.. పవన్‌కు అంబటి చురకలు

Published Sat, Feb 24 2024 5:18 PM | Last Updated on Sat, Feb 24 2024 9:41 PM

Minister Ambati Rambabu Comments On Pawan Kalyan - Sakshi

 పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని.. చంద్రబాబు, పవన్‌ కన్ఫ్యూజన్‌తో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సాక్షి, సత్తెనపల్లి: పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని.. చంద్రబాబు, పవన్‌ కన్ఫ్యూజన్‌తో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్‌ అన్నారు.. కానీ బీజేపీ సింబల్‌ లేకుండానే పొత్తు ప్రకటన చేశారు. సీఎం అవుతానన్న పవన్‌ 24 సీట్లకు పరిమితమయ్యాడు. జనశ్రేణుల ఆత్మగౌరవాన్ని పవన్‌ దెబ్బతీశారు. పవన్‌ది తిక్క లెక్క. పవన్‌ సీఎం అవుతారని కాపులు భావించారు. 24 సీట్లతో పవన్‌ సీఎం ఎలా అవుతారు’’ అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

‘‘పవన్‌ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు. ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్‌ ఉన్నారు. పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అభిమానులకు పవన్‌ వెన్నుపోటు పొడిశారు. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే వీలీనం చేసి సినిమాలు తీసుకో’’ అంటూ పవన్‌కు మంత్రి అంబటి సలహా ఇచ్చారు.


 

ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement