సాక్షి, అమరావతి: చంద్రబాబు ఎన్నో దీపాల్ని ఆర్పేశారని.. అలాంటి చంద్రబాబు అరెస్ట్ అయితే నిరసన కోసం దీపాలు ఆర్పడం ఏంటని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం కృష్ణా జలాల అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ పరిణామాలపైనా స్పందించారు.
‘‘పవన్.. అవనిగడ్డలోనేమో ఎన్డీయే నుండి బయటకు వచ్చానన్నారు. మరో మీటింగ్‌లో ఎన్డీయే లోనే ఉన్నానన్నారు. నారా లోకేష్.. చంద్రబాబు అవినీతి పై ఇంటింటికీ ప్రచారం చేస్తా అంటున్నారు. వీళ్లకు బాలకృష్ణ కలిశారు. ఈ ముగ్గురు పొలిటికల్ బఫూన్స్ అని మంత్రి అంబటి విమర్శించారు.
పవన్ పాత్ర ఉందేమో?
పొత్తుల ప్రకటనకు ముందు పవన్ సభలు ఎలా జరిగాయి?. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో.. చూస్తే అర్థం అవుతుందన్నారు అంబటి . ‘‘ప్రజలు పవన్, చంద్రబాబు పొత్తులను అంగీకరించటం లేదు. ఆ రెండు ఓట్లు కలిసేలా లేవు. 2014-19 మధ్యలో చంద్రబాబు చేసిన స్కాంలపై విచారణ జరుగుతోంది. ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందని మా అనుమానం. అవినీతితో అరెస్టు ఐన వ్యక్తికి మద్దతు ఇవ్వటం వెనుక కారణం.. లంచాల్లో వాటా అందటం వలనే!.
కోట్ల రూపాయలు తీసుకుని వాదించే లాయర్లను చంద్రబాబు పెట్టుకున్నారు. అయినా సరే ఆధారాలు పక్కాగా ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ వేశారు. రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుంది’’ అంటూ అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
పవన్ పొత్తు అనైతికం
ఎన్నో దీపాలను ఆర్పేసిన అవినీతిపరుడు చంద్రబాబు. ఆయన అరెస్ట్‌కు నిరసనగా.. ఇళ్లలో లైట్లు ఆర్పేయటం ఏంటి?. పవన్ చెత్తశుద్దితో చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ బలహీన పడిందని పవన్ స్పష్టంగా చెప్పారు. పవన్ ఎన్డీయేతో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎలా సపోర్ట్ చేస్తారు?. ఎన్డీయే నుండి బయటకు రాకుండా ప్రకటించిన ఈ పొత్తు అక్రమం, అనైతికం’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
చదవండి: ఏపీ రాజకీయాల్లో అపరిచితుడు ఈయనే!
Comments
Please login to add a commentAdd a comment