సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా.. కేసీఆర్ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాలా? లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాలా ? ఆలోచించు తెలంగాణ రైతన్నా’’ అంటూ రైతాంగాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
కాగా, ఎన్నికల కోడ్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ అందిస్తున్న మంచినీళ్లు, 24 గంటల కరెంటును కూడా ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని సంక్షేమ పథకాల్లోనూ ప్రజలకు కేసీఆర్ కనిపిస్తారని, ఆ పథకాలన్నీ నిలుపుదల చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు పథకాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదును ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. ఈ మేరకు పార్టీ నాయకులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టేలా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా
— KTR (@KTRBRS) October 27, 2023
కెసిఆర్ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాల్నా ?
లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాల్నా ?
లేకపోతె తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాల్నా ?
ఆలోచించు తెలంగాణ రైతన్నా
ఆరు దశాబ్దాలు… pic.twitter.com/cpfUe3N7yV
Comments
Please login to add a commentAdd a comment