సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు.. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమే..’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ సభను ప్రస్తావిస్తూ.. ‘అది డిక్లరేషన్ సభ కాదు, అధికారం రానే రాదనే భావనతో జరిపిన ఫ్ర్రస్టేషన్ సభ’ అని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ తెలంగాణ కొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది? చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాలిలో దీపాలే..’ అని కేటీఆర్ విమర్శించారు.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీలు ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే ఇందుకు ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీయే. దళితులు, గిరిజనుల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల పాటు చేసిన పాపం ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ, ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు..’ అని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment