సాక్షి, తాడేపల్లి: టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తనను నమ్మిన అభిమానులని మోసం చేశారని మండిపడ్డారు మంత్రి ఆర్‌కే రోజా. జైలులో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పవన్ అని విమర్శించారు మంత్రి రోజా. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని మరోసారి గుర్తుచేశారు రోజా.
మంత్రి ఆర్‌కే రోజా ఇంకా ఏమన్నారంటే..
తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్
తన తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్. సీఎం జగన్కఉ ఎంపీగా 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయావు. పవన్ మిగిలిన పార్టీ జెండాలు మోసే కూలీగా మారిపోయారు. తండ్రి అడుగుజాడల్లో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్. పవన్ తన స్థాయికి తగినట్టు మాట్లాడాలి. అమిత్ షాకు కంప్లైంట్ చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దేనిలో నైనా సక్సెస్ అయ్యారా ?, యుద్దానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే ఉన్నారు.
పవన్‌కు 10 చోట్లయినా అభ్యర్థులున్నారా?
కనీసం 10 చోట్లయినా పవన్‌కు అభ్యర్థులున్నారా ?, సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికినా వీరికి సిగ్గు లేదు. టీడీపీ సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నారు. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకుండా ఉంటారా ?, అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ తో అందరికీ అర్థమైంది. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారు. బ్రహ్మణికి రాజకీయంగా ఏమి తెలీదని నిన్ననే అర్ధమైంది
బ్రహ్మిణికి ఏం తెలుసనీ మాట్లాడుతున్నారు
లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలీదు. బ్రహ్మణికి ఏం తెలుసనీ మాట్లాడుతున్నారు. స్కిల్ స్కామ్ గురించి వీరెవరూ ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు సంతకాలు పెట్టారో లేదో సీఐడీ ఆఫీసుకు వెళితే చూపిస్తారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో 13 చోట్ల సంతకాలు పెట్టారా లేదా ?, సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకోలేదని చెప్పిందా లేదా ?, బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారా లేదా ?, అధికారులు వద్దని చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారా లేదా?, ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలి. ఉద్యోగాలు పేరుతో చంద్రబాబు యువతను మోసం చేశారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. బ్రాహ్మణి చంద్రబాబు మేనిఫెస్టో తెప్పించుకుని చూడాలి.స్కిల్ స్కామ్ ను జీఎస్టీ , ఈడీ వెలుగులోకి తెచ్చాయి
పవన్ పిచ్చికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం
సీఎం జగన్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయిన, ఎవడికైనా పళ్లు రాలగొడతామన్నారు మంత్రి ఆర్‌కే రోజా. ‘పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం. సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ. దొంగ చెప్పే మాటలు ఎవరు పట్టించుకుంటారు. సుమన్ బోస్ మాజీ ఎండి ఎందుకయ్యారు?, సీమన్స్ సంస్థ కోర్టులోనే ఈ వ్యక్తి తమకు తెలియకుండా చేశాడని కోర్టులోనే చెప్పారు’ అని రోజా తెలిపారు.
చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ?
Comments
Please login to add a commentAdd a comment