Minister Rk Roja Comments On Chandrababu, Lokesh And Pawan Kalyan, Details Inside - Sakshi
Sakshi News home page

RK Roja: ‘ఎన్నికలొస్తున్నాయి.. వానపాములు బుసకొడుతున్నాయ్‌’

Published Tue, May 10 2022 2:34 PM | Last Updated on Tue, May 10 2022 3:23 PM

Minister Rk Roja Comments On Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు అని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఒక్క చోట గెలవలేని పవన్‌.. జగనన్నను ఓడిస్తాననడం సిగ్గు చేటన్నారు. ‘‘బాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు గ్రామాల్లో తిరిగి విషం చిమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్‌ ఏమైనా దేవుడా.. జ్యోతిష్యుడా’’ అంటూ రోజా దుయ్యబట్టారు.
చదవండి: ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం

‘‘చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయాడు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం జగన్‌ తప్పించుకుని పారిపోలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఒక్కరోజైనా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేశారా?. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు చంద్రబాబును మొన్నటి ఎన్నికల్లో తరిమికొట్టారన్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొస్తుండటంతో వాన పాములు కూడా లేచి బుస కొడుతున్నాయని’’ రోజా ఎద్దేవా చేశారు. 

‘‘అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని హామీలు నెరవేర్చిన సీఎంను ఏపీలో మాత్రమే చూడగలం. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి దేశంలో ఎవరూ చేయలేనంత గొప్ప పని చేశారు. సీఎం జగన్‌ను సంక్షేమ సామ్రాట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదని’’ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement