
ఆర్యవైశ్యులపై చంద్రబాబుది కపట ప్రేమ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యులపై చంద్రబాబుది కపట ప్రేమ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. లేనప్పుడు మరో మాట అంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబుకి పొట్టి శ్రీరాములు నిన్నే గుర్తుకువచ్చారు. ఆర్య వైశ్యులను చులకనగా చూసి అవమానించింది చంద్రబాబే. రోశయ్యను ఏడిపించిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.
చదవండి: RRR Movie: మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన