సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడు అంటూ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
కాగా, జీవన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు. మిషన్ భగీరథ పెద్ద స్కాం. కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్. కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించింది. నిధుల దారి మళ్లింపును చర్చకు రాకుండా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారు.
గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అందుకే వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment